Site icon NTV Telugu

Pakistan Minister: అందరిముందు పాకిస్తాన్ మంత్రి పరువు తీసిన మహిళ యాంకర్.. వీడియో వైరల్

Min

Min

Pakistan Minister: నేడు ఉదయం జరిగిన “ఆపరేషన్ సింధూర్” ద్వారా భారత దేశ రక్షణ శాఖ కీలక విజయాన్ని సాధించింది. ఈ ఆపరేషన్‌లో భారత్, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా మిస్సైల్స్‌తో దాడి నిర్వహించింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముఖ్య ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాద నిర్మూలనలో ఇది ఒక పెద్ద ముందడుగు అని భారత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ లో సంచలనం రేగింది. భారత దాడుల నేపథ్యాన్ని తప్పుబట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుండగా, ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Read Also: Uttam Kumar Reddy: సిడబ్ల్యూసి ఛైర్మన్‌తో మంత్రి భేటీ.. నీటి ప్రాజెక్టులపై కీలక సమావేశం.!

ఇందులో భాగంగా ఓ చర్చలో పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు లేవని, తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తప్పించుకొనే ప్రయత్నం చేసారు. అయితే, ఆయన వ్యాఖ్యలను టీవీ యాంకర్ తీవ్రంగా తిరస్కరించారు. “జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్” ఘటనపై పాకిస్థాన్ స్పందించలేదని మంత్రి చెబుతుండగా.. యాంకర్ ప్రత్యుత్తరంగా ఆధారాలు చూపిస్తూ ఆయన నోరు మూయించారు. అంతేకాకుండా ఆ యాంకర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ రక్షణ మంత్రే ఇటీవలే గత మూడు దశాబ్దాలుగా తమ దేశం ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించిందని స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు.

Read Also: Indo-Pak: బార్డర్‌లో పాక్‌ ఆర్మీ విచక్షణారహిత కాల్పులు.. 15 మంది భారతీయ పౌరులు మృతి!

అలాగే, ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ గురించి మాట్లాడుతూ.. 2011లో అమెరికా సైన్యం అతన్ని అబోటాబాద్‌ లోనే చంపిందని.. దాంతోపాటు బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోనే దొరికాడన్న విషయం మాకు తెలిసిందే అని మహిళ యాంకర్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రత్యక్ష ప్రసారంలోనే పాకిస్థాన్ మంత్రికి చిక్కు ఎదురైంది. మినిస్టర్ మాట్లాడిన మాటలు అబద్ధాలు అని తేలడంతో సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై ఆ దేశ ప్రభుత్వ వాస్తవ స్థితిని మళ్లీ ప్రపంచానికి చూపించింది. “ఆపరేషన్ సింధూర్” దాడి ప్రభావంతో పాటు, ఈ ఇంటర్వ్యూలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పాక్‌ను అంతర్జాతీయంగా ఇబ్బందికర స్థితిలో నిలబెట్టినట్లయింది.

Exit mobile version