పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితమే ఏర్పడింది. షాబాజ్ ప్రభుత్వం సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకుంది. నిజానికి, ప్రజల కష్టాలు పెరుగుతున్నాయి. పాక్ లో రోజు రోజుకి ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచింది. పెట్రోలు ధరను లీటరుకు 9.66 పీకేఆర్ (పాకిస్థానీ కరెన్సీ) పెంచుతున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈద్ ఉల్-ఫితర్‌కు ముందు పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన ప్రజలను దెబ్బ తీసింది. ఈరోజు నుంచి కొత్త పెట్రోల్ ధరలు కూడా అమల్లోకి వచ్చాయి.
Read Also: Ganja In Hyderabad: బరితెగించేశారుగా.. యదేచ్చగా గంజాయి ని కిరాణం స్టోర్ లో అమ్మేస్తున్నారుగా..?!
ఇక, ఈ కొత్త ధరల పెంపు తర్వాత పెట్రోల్ ధర లీటరుకు PKR 279.75 నుంచి PKR 289.41కి చేరింది. హై-స్పీడ్ డీజిల్ (HSD) ధర లీటరుకు PKR 3.32 తగ్గి PKR 282.24కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్లే ఈ మార్పులు చోటు చేసుకున్నాయని పాక్ మంత్రిత్వ శాఖ తెలిపింది. డాన్ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరల వైవిధ్యాన్ని దేశీయ మార్కెట్‌తో సరిపోల్చాలనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపింది. ఇక, పెట్రోలియం, విద్యుత్ ధరల పెరుగుదల అధిక ద్రవ్యోల్బణానికి ప్రధాన కారకాలుగా పరిగణించబడుతుంది. పెట్రోలు ఎక్కువగా వ్యక్తిగత రవాణా, చిన్న వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలలో ఉపయోగించబడుతుంది. ఇది దిగువ, మధ్య తరగతి ప్రజల బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
