NTV Telugu Site icon

Petrol Rates : భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధర.. ఏకంగా రూ.35పై మాటే

Pak

Pak

Petrol Rates: పాకిస్తాన్ లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. ఏకంగా ఒక్కరోజులోనే అక్కడ ప్రభుత్వం ఏకంగా పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ.35పెంచేసింది. పెంచిన ధరలు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్‌ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్‌ దార్‌ ప్రకటించారు. అదేవిధంగా కిరోసిన్‌, లైట్ డీజిల్ ఆయిల్ ధరలను కూడా లీటర్‌కు రూ.18 చొప్పున పెంచినట్లు ఇషాక్‌ దార్‌ తెలిపారు. మొత్తం నాలుగు రకాల పెట్రోలియం ఉత్పత్తులను ధరలను పెంచినట్లు ఆయన వెల్లడించారు. పెరిగిన ధరలతో కలిపి పాకిస్థాన్‌లో లీటర్‌ హైస్పీడ్‌ డీజిల్‌ ధర రూ.262.80కు చేరింది. అదేవిధంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.249.80కు పెరిగింది. పాకిస్తాన్ ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు రేపో, మాపో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కి చెందిన అధికారుల బృందం ఈ దేశానికి రానున్న సందర్భంలో .. పెట్రో ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం ఇలా ఒక్కసారిగా పెంచివేసింది.

Read Also: SP Sirisha : హైదరాబాద్ ఇంటలిజెన్స్ ఎస్పీగా శిరీష

ఇక లీటర్‌ కిరోసిన్‌ ఆయిల్‌ ధర రూ.189.83కు, లీటర్‌ లైట్‌ డీజిల్‌ ధర రూ.187కు చేరింది. పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ సూచన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గత వారం రోజులుగా అమెరికన్‌ డాలర్లో పోల్చితే పాకిస్థాన్ రూపీ 11 శాతం పతనమయ్యిందని, దాంతో అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి పెట్రో దిగుమతుల భారం పెరిగిందని, అందుకే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి వీటి రేట్లను లీటరు 45 నుంచి 80 రూపాయలకు పెంచవచ్చునని, లేదా పెట్రోలు కొరత పెరిగిపోయి పెట్రోలు బంకులు మూతబడతాయని సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను తమ చర్య తోసిపుచ్చినట్టయిందని ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దర్ అన్నారు.

Read Also: Allola Indrakaran Reddy : నాందేడ్ స‌భ ఏర్పాట్లను పరిశీలించిన ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి