NTV Telugu Site icon

Pak Twitter Account: భారత్‌లో మరోసారి పాకిస్థాన్‌ అధికారిక ట్విట్టర్ ఖాతా నిలిపివేత

Pak Twitter Account

Pak Twitter Account

Pak Twitter Account: పాకిస్థాన్‌ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా మరోసారి భారత్‌లో నిలిచిపోయింది. పాకిస్థాన్‌ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా నిలిపివేయడం ఇది రెండోసారి. గతంలో జులైలో ఓ సారి భారత్ నిలిపిపేయగా.. తర్వాత మళ్లీ యాక్టివేట్ చేయబడింది. ఈ సారి ఖాతాలో “గవర్నమెంట్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ అకౌంట్‌ హ్యాజ్‌ బీన్‌ విత్‌ హెల్డ్‌ ఇన్‌ ఇండియా ఇన్‌ రెస్పాన్స్‌ టు ఏ లీగల్‌ డిమాండ్‌” అనే సందేశం కనిపిస్తోంది. చట్టపరమైన డిమాండ్ ఎదురైనప్పుడు ట్విట్టర్ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది జులైలో పలు పాకిస్థానీ ట్విట్టర్‌ హ్యాండిల్స్‌పై భారత్‌ సర్కారు ఇలాంటి చర్యలే తీసుకుంది. ఇంతకుముందు, భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 16 యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లతో సహా ఆరు పాకిస్తాన్ ఆధారిత ఛానెల్‌లను బ్లాక్ చేసింది.

Ministry of Jalshakti: మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దం

ఈ ఏడాది జూన్‌లో యూఎస్, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్‌లోని పాక్‌ రాయబార కార్యాలయాలను అధికారిక ఖాతాలను నిలిపివేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌ లోనూ 8 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానల్స్‌ను కేంద్ర సర్కారు బ్లాక్‌ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం అత్యవసర అధికారాలను విధించడం ద్వారా ఈ చర్య తీసుకున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చర్యకు ఆగస్టు 16న ఆదేశాలు వచ్చాయి. బ్లాక్ చేయబడిన భారతీయ యూట్యూబ్ ఛానెల్‌లు నకిలీ, సంచలనాత్మక థంబ్‌నెయిల్‌లను ఉపయోగిస్తున్నట్లు గమనించబడింది. వార్తా యాంకర్‌ల చిత్రాలు, కొన్ని టీవీ న్యూస్ ఛానెల్‌ల లోగోలు వీక్షకులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా ద్వేషపూరిత సంబంధాలను వ్యాప్తి చేస్తున్నందుకు ఇప్పటివరకు 100కు పైగా యూట్యూబ్ ఛానెల్‌లు, 4 ఫేస్‌బుక్ పేజీలు, 5 ట్విట్టర్ ఖాతాలు మరియు 3 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.