Site icon NTV Telugu

Viral Video: లైవ్ లోనే గుక్కపట్టి ఏడ్చిన మంత్రి

Pak Minister

Pak Minister

Viral Video: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి బాధ ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. లైవ్ టీవీ షోలో ఏడుస్తూ కనిపించాడు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సన్నిహితుడైన ఫవాద్ చౌదరిపై దేశద్రోహం ఆరోపణలు వచ్చాయి. పాకిస్థాన్‌లో ప్రభుత్వం మారి షాబాజ్ షరీఫ్ పీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జైలుకు వెళ్లిన నేతల్లో ఫవాద్ చౌదరి పేరు కూడా ఉంది. ఇస్లామాబాద్ హైకోర్టు నుంచి బెయిల్ పొందడంతో ఫవాద్ చౌదరి ఇటీవలే అడియాలా జైలు నుంచి విడుదలయ్యాడు.

Read Also: Delhi Girl : ఢిల్లీలో ఘోరం.. దేశానికి కాదు దారుణాలకు రాజధాని

దేశద్రోహం కేసులో అరెస్టై విడుదలైన ఆయన.. జైలు జీవితాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ఫవాద్ చౌదరిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందని, కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటని టీవీ యాంకర్ ఫవాద్‌ను ప్రశ్నించారు.
Read Also: Wedding procession: అందరిలా చేస్తే ఏముంటది.. వెరైటీ ఉండాల్సిందే

తనను అరెస్టు చేసినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫవాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చేతికి సంకెళ్లు, మొహానికి ముసుగు వేసి కోర్టుకు తీసుకెళ్లారని, ఫోన్ కూడా లాక్కున్నారని చెప్పారు. ఆ ఫోన్ ఇంకా తనకు తిరిగి ఇవ్వలేదన్నారు. జైల్లో ఉన్నప్పుడు కుమారులు తనను చూసేందుకు వచ్చినప్పుడు చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే బోరున విలపించారు. కన్నీటిని చేతులతో తుడుచుకుంటూనే మాట్లాడారు. ఫవాద్‌కు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేయొద్దనే షరతుతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Exit mobile version