Site icon NTV Telugu

Pakistan Election: ఎన్నికలకు ముందు పాక్ లో హింస.. కరాచీలో రెండు పార్టీల మధ్య ఘర్షణ

Pakisthan Godava

Pakisthan Godava

పాకిస్థాన్‌లో ఈ నెల 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లో హింసాకాండ కొనసాగుతోంది. కరాచీలో ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. ఈ హింసాత్మక ఘర్షణలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో పాకిస్థాన్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Read Also: Joram : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మనోజ్ బాజ్‍పేయ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘జోరమ్’..

అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య ఇది ​పెద్ద గొడవ జరిగింది. గత ఆదివారం, కరాచీలోని నజిమాబాద్ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలో ముత్తాహిదా క్వామీ ఉద్యమ కార్యకర్త మరణించాడు. ముత్తాహిదా క్వామీ ఉద్యమం కూడా పీపీపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక, తాజాగా న్యూ కరాచీలోని సెక్టార్ 11-జెలో ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్- పీపీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది అని వెల్లడించారు. అంతకుముందు, జనవరి 22న కరాచీలోని హైదరీ ప్రాంతంలో జరిగిన హింసాకాండపై ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.

Exit mobile version