Khawaja Asif: భారత్‌పై కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ తాజాగా మితిమీరిన ప్రకటనలు చేస్తోంది. ఓ వైపు ఆఫ్ఘనిస్థాన్ దాడులను ఎదుర్కొనేందుకు సత్తాలేని పాక్.. భారతదేశంపై యుద్ధానికి సిద్ధమంటూ వివాదాస్పద ప్రకటన చేసింది. తాజాగా ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆఫ్ఘన్‌పై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాలిబన్లకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమని.. అవసరమైతే భారతదేశంపై కూడా దాడులు చేస్తామని చెప్పాడు. పాకిస్థాన్ రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉందని అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని జర్నలిస్ట్ ఖవాజా ఆసిఫ్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆసిఫ్.. “పాకిస్థాన్ విషయంలో ఆఫ్ఘనిస్థాన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నాయి. పాక్ రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉంది. భారత్ సరిహద్దులో డర్టీ గేమ్ ఆడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ యుద్ధ వ్యూహాలను రూపొందించింది. యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు పాక్ సిద్ధంగా ఉంది.” అని ఆసిఫ్ వెల్లడించారు.
READ MORE: Australia: వన్డే ప్రపంచకప్‌లో ఎదురేలేదు.. అప్పుడే సెమీస్‌కి వచ్చేసారుగా!
గత కొద్ది రోజులగా పాక్- ఆఫ్ఘన్ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు మరణించారు. పాకిస్థాన్‌కి చెందిన సైనికులు తమకు లొంగిపోయారని ఆఫ్ఘనిస్థాన్ చెబుతోంది. అయితే.. ఈ యుద్ధంపై ఇటీవల పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ భారతదేశంపై వింత వాదనను చేశారు. న్యూఢిల్లీ(భారత్) తాలిబాన్లను స్పాన్సర్ చేస్తోందని, పాకిస్థాన్‌పై పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన మరునాడే మళ్లీ భారత్‌పై సైతం యుద్ధానికి సిద్ధమంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
