NTV Telugu Site icon

Imran Khan: ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీకి కోర్టు సమన్లు జారీ.. ఎందుకంటే?

Imran Khan

Imran Khan

Imran Khan: ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల అక్రమ వివాహంపై కేసును కోర్టులో విచారణకు అర్హమైనదిగా పేర్కొంది. జూలై 20న వారిద్దరు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. సివిల్ జడ్జి ఖుద్రతుల్లా తీర్పును ప్రకటించి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్‌ఖాన్, ఆయన భార్యకు నోటీసులు జారీ చేశారు.

పిటిషనర్ మహమ్మద్ హనీఫ్ ప్రకారం.. బుష్రా బీబీకి నవంబర్ 2017లో ఆమె మాజీ భర్త ఖావర్ మనేకా విడాకులు ఇచ్చారని, ఆమె ‘ఇద్దత్’ కాలం ముగియనప్పటికీ, జనవరి 2018లో ఇమ్రాన్‌ఖాన్‌ను వివాహం చేసుకున్నారని, ఇది షరియా, ముస్లిం నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇద్దత్ అనేది విడాకులు, మరణం లేదా ఆమె భర్త నుండి విడిపోవడం ద్వారా స్త్రీ వివాహం రద్దు అయిన తర్వాత 130 రోజుల నిరీక్షణ కాలం. ఆ సమయంలో స్త్రీ అవివాహితగా ఉంటుంది.

Also Read: Pakistan: సీమాను తిరిగి పంపకపోతే 26/11 తరహా దాడి హెచ్చరికలు.. కొందరిపై కేసు నమోదు!

ఇమ్రాన్ ఖాన్‌తో వివాహానికి ముందు, బుష్రా ఖావర్ మనేకాను వివాహం చేసుకుంది. 2017లో అతనితో విడాకులు తీసుకుంది. ఇమ్రాన్, బుష్రా మధ్య వివాహం జరిపించిన మతాధికారి ముఫ్తీ మహమ్మద్ సయీద్ తన వాంగ్మూలాలలో ఇమ్రాన్‌ఖాన్ తన ఇద్దత్ సమయంలో బుష్రా బీబీని వివాహం చేసుకున్నారని కోర్టుకు సమర్పించారు. 2017 నవంబర్‌లో బుష్రా బీబీకి ఆమె మాజీ భర్త విడాకులు ఇచ్చారని, బుష్రా బీబీని పెళ్లాడితే పీటీఐ ఛైర్మన్ పాకిస్థాన్ ప్రధాని అవుతారన్న అంచనాలు కూడా ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read: Opposition Alliance: విపక్షాల కూటమి కొత్త పేరు INDIA..

గత వారం, ఇస్లామాబాద్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి (ADSJ) మహమ్మద్ ఆజం ఖాన్ కేసును సివిల్ జడ్జికి మార్చారు. వివాహం చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అభ్యంతరకరంగా పేర్కొంటూ మరో సివిల్ కోర్టు తీర్పును తోసిపుచ్చారు. 2018 జనవరి 1న ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీల వివాహాన్ని నిర్వహించినట్లు ముఫ్తీ సయీద్, బుష్రా సోదరి అని చెప్పుకునే ఒక మహిళ తన వివాహానికి షరియా అవసరాలు తీర్చినట్లు హామీ ఇచ్చిందని చెప్పాడు. పెళ్లి తర్వాత తమ జంట ఇస్లామాబాద్‌లో కలిసి జీవించడం ప్రారంభించినట్లు సయీద్ తెలిపారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 2018లో తనను సంప్రదించారని, మళ్లీ పెళ్లి నిర్వహించాలని అభ్యర్థించారని ఆయన పేర్కొన్నారు.