NTV Telugu Site icon

Pakistan PM: బలూచిస్థాన్‌కు RAW నిధులు..

Anwarul Haq Qaqar

Anwarul Haq Qaqar

Anwaar ul Haq Kakar: పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ భారత గూఢచార సంస్థ RAWపై సంచలన ఆరోపణలు చేశారు. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేస్తున్న వారిని ఉగ్రవాదులుగా అభివర్ణించారు. అయితే, వారికి RAW నిధులు సమకూరుస్తుందన్నారు. ఇస్లామాబాద్‌లో బలూచ్‌ల నిరసనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలూచిస్థాన్‌కు చెందిన నలుగురు యువకులు ఇస్లామాబాద్ రావడంతో బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చారు. ప్రత్యేక దేశంగా బలూచిస్థాన్ కావాలని ఇస్లామాబాద్ వరకు సదరు యువకులు లాంగ్ మార్చ్ చేపట్టగా.. ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఈ విధ్వంసం సృష్టించారు. దీంతో ఇస్లామాబాద్‌లో గత వారం రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేర్‌టేకర్‌ పీఎం బలూచిస్థాన్‌కు చెందిన వ్యక్తి కావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బలూచ్ అయినప్పటికీ ఆయన తమ సమస్యను పరిష్కరించడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hit And Run New Law : నిరసనతో 25 లక్షల ట్రక్కులు.. దెబ్బతిన్న నిత్యావసర వస్తువుల సరఫరా

ఇస్లామాబాద్‌లో జరిగిన నిరసనపై కాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలూచిస్థాన్‌లోని సాయుధ సంస్థలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందని తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ అన్నారు. అయితే, నిరసనలకు మద్దతు ఇచ్చే వారు బీఎల్ఏలో చేరాలని సూచించారు. తమ కుటుంబ సభ్యులు హత్యకు గురైనందున నిరసన తెలిపే హక్కు నిరసనకారులకు ఉంది.. అయితే, తన కుటుంబ సభ్యులు దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి అని ఆయన అన్నారు. ఇది 1971 కాదు, బలూచిస్థాన్ విడిపోయే బంగ్లాదేశ్ కాదని పాక్ ప్రధాని అన్నారు. ఈ ఉగ్రవాదులు హత్యలు చేస్తారు.. ఇండియా నుంచి డబ్బులు తీసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నారు అని పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ అన్నారు.