Site icon NTV Telugu

Pakistan-Afghan War: “అందితే జుట్టు అందకపోతే కాళ్లు”.. పాకిస్థాన్‌కు నమ్మక ద్రోహం కొత్తేం కాదు..!

Pakistan Pm

Pakistan Pm

Pakistan-Afghan War: పాకిస్థాన్‌కి నమ్మక ద్రోహం చేయడం అలవాటే.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటుంది దాయాది దేశం. గతంలో భారత్- పాక్ మధ్య ఘర్షణలు జరిగినప్పుడు కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తరువాత కూడా ఉల్లంఘించి దాడులు జరిపింది. భారత్ దాడులకు తట్టుకోలేక.. మమ్మల్ని కాపాడండి అంటూ.. కాల్పుల విరమణ కోసం ఇతర దేశాలకు మొరపెట్టుకుంది. తీరా ఒప్పందం జరిగిన వెంటనే దాన్ని ఉల్లంఘించి దొడ్డిదారిన దాడులు చేసింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో సైతం అదే వైఖరిని అవలంబించింది. 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే దాన్ని ఉల్లంఘించింది. ఆఫ్ఘన్‌పై వైమానిక దాడులు జరిపి ముగ్గురు క్రికెటర్లను సైతం పొట్టనపెట్టుకుంది. దీంతో మరోవైపు తాలిబన్ సైన్యం ఆగ్రహానికి గురవుతోంది. పాక్ ఉల్లంఘణను తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది.

READ MORE: Krithi Shetty : కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !

వాస్తవానికి.. ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ ఇటీవల ఆఫ్ఘన్‌లోని కాబుల్‌పై దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘన్ రెచ్చిపోయింది. పాక్‌ సరిహద్దుల వెంట కాల్పులు జరిపి చాలా మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం లేకపోవడంతో, పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. వెంటనే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ఖతార్, సౌదీ అరేబియాలకు అక్టోబర్ 15న పాకిస్థాన్ ఫోన్ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఎలాగోలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. దొడ్డి దారిన రెచ్చిపోయి దాడులు చేయడం ఆగ్రహాన్ని రేకిత్తిస్తోంది.

READ MORE: Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా కూడా చేసుకుంటారా

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం, రెండు దేశాలు పరస్పరం 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి అంగీకరించాయి. అయితే, పాకిస్థాన్ మళ్లీ వంకర బుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించి ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు చేసింది. డ్యూరాండ్ లైన్‌కు ఆనుకుని ఉన్న పాక్టికా ప్రావిన్స్‌లోని అనేక జిల్లాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సైతం మరణించారు. పాకిస్థాన్ దాడిలో తమ ముగ్గురు క్రికెటర్లు మరణించడం పట్ల ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

READ MORE: Maithili Thakur: ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తా.. అలీనగర్‌లో నామినేషన్ వేసిన మైథిలి ఠాకూర్

ఈ ముగ్గురు క్రికెట్లను కబీర్, సిబ్గతుల్లా, హరూన్ గా చెబుతున్నారు. వీళ్లతో పాటు మరో ఎనిమిది మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. నివేదికల ప్రకారం.. ఈ ఆటగాళ్ళు పాక్టికా రాజధాని షరానాలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడటానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం ఉర్గున్ జిల్లాలో ఓ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్లపై దాడి జరిగింది. ఇది ఆఫ్ఘన్ క్రీడా, క్రికెట్‌కి గణనీయమైన నష్టంగా ACB అభివర్ణించింది. అమరవీరుల కుటుంబాలకు, పాక్టికా ప్రజలకు బోర్డు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ విషాద సంఘటనతో నవంబర్ చివరలో జరగనున్న పాకిస్థాన్‌తో సహా రాబోయే T20 సిరీస్ నుంచి వైదొలగాలని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. “అల్లాహ్ (SWT) అమరవీరులకు స్వర్గంలో ఉన్నత హోదాను ప్రసాదించుగాక, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు సహనం, బలాన్ని ప్రసాదించుగాక” అని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

Exit mobile version