Imran Khan: లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జూన్ 2 వరకు రెండు కేసులలో బెయిల్ మంజూరు చేసింది. జిన్నా హౌజ్ విధ్వంసం కేసు, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్త జిల్లే షా హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. జూన్ 2 వరకు రెండు కేసుల్లో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది.
Read Also: Subhash Maharia: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా!
ఇమ్రాన్ ఖాన్ తన న్యాయవాది, బారిస్టర్ సల్మాన్ సఫ్దర్ ద్వారా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్‌పై “నిరాధారమైన కేసు” నమోదైందని పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రతీకార రాజకీయాల బాధితుడని, రాజకీయ కారణాలతో ఒంటరిగా ఉన్నారని పిటిషన్‌లో తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లే షా హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.