Site icon NTV Telugu

Afghanistan – Pakistan: సరైన సమయంలో పాకిస్థాన్‌కు రిటన్ గిఫ్ట్ ఇస్తాం: తాలిబన్లు

Afghanistan Pakistan

Afghanistan Pakistan

Afghanistan – Pakistan: ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ మరోసారి దాడి చేసింది. దాడిపై తాలిబన్లు స్పందిస్తూ.. సరైన సమయం వచ్చినప్పుడు పాకిస్థాన్ సైన్యానికి తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం రాత్రిపూట పాకిస్థాన్ వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మరణించిన తరువాత ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం “సరైన సమయంలో తగిన ప్రతిస్పందన” ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది.

READ ALSO: Andhra King Taluka : భాగ్య శ్రీతో డేటింగ్ పై స్పందించిన రామ్ పోతినేని

తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఒక ప్రకటనలో “ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టికా, ఖోస్ట్, కునార్ ప్రావిన్సులలో పాకిస్థాన్ సైన్యం నిన్న రాత్రి నిర్వహించిన వైమానిక దాడులు ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడి, పాకిస్థాన్ అధికారులు అంతర్జాతీయంగా గుర్తించిన నిబంధనలు, సూత్రాలను స్పష్టంగా ఉల్లంఘించారు. పాకిస్థాన్ దళాల ఈ శత్రు చర్యలు ఏమీ సాధించలేవు, సరికాని నిఘా ఆధారంగా జరిగే కార్యకలాపాలు ఉద్రిక్తతలను పెంచుతాయి. ఇస్లామిక్ ఎమిరేట్ ఈ ఉల్లంఘన, నేరాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తమ గగనతలం, భూభాగం, ప్రజలను రక్షించుకోవడానికి మాకు చట్టబద్ధమైన హక్కు ఉంది. తగిన సమయంలో తగిన విధంగా ఆఫ్ఘన్ స్పందిస్తుంది” అని అన్నారు.

ఆఫ్ఘన్ దాడిపై పాక్ స్పందన..
ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌లోని నివాస ప్రాంతంపై పాకిస్థాన్ సైన్యం జరిపిన దాడిలో తొమ్మిది మంది పిల్లలు ఒక మహిళ మరణించారని ఆఫ్ఘన్ ప్రభుత్వం మంగళవారం తెలిపింది. తాలిబన్ అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడి అర్ధరాత్రి తర్వాత జరిగింది, స్థానికుల ఇండ్లను లక్ష్యంగా చేసుకుంది, సరిహద్దులో శత్రుత్వం పెరుగుతుందనే ఆందోళనలను ఈ దాడి తిరిగి పెంచిందని వెల్లడించారు. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. మంగళవారం తెల్లవారుజామున 12:00 గంటల ప్రాంతంలో ఖోస్ట్‌లోని గుర్బుజ్ జిల్లాలోని మొఘల్‌గై ప్రాంతంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. పాకిస్థాన్ దళాలు ఆఫ్ఘన్ పౌరుడు, ఖాజీ మీర్ కుమారుడు వాలియత్ ఖాన్ ఇంటిపై బాంబు దాడి చేశాయని ఆయన అన్నారు. ఈ దాడిలో తొమ్మిది మంది పిల్లలు (ఐదుగురు బాలురు, నలుగురు బాలికలు) ఒక మహిళ మరణించారు. అలాగే ఈ రాత్రి కునార్, పక్తికా ప్రావిన్సులలో వేర్వేరు వైమానిక దాడులు జరిగాయని, ఈ దాడిలో నలుగురు పౌరులు గాయపడ్డారని ఆయన చెప్పారు.

గతంలో అక్టోబర్ 9న పాకిస్థాన్ కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, పాక్టికాలో వైమానిక దాడులు చేసింది. అయితే దీనికి ఆఫ్ఘన్ తాలిబన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. అక్టోబర్ 11, 12 రాత్రుల మధ్య ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులోని అనేక పాక్ సైనిక పోస్టులపై తాలిబన్ దళాలు దాడి, భీకర కాల్పులు జరిపాయి. అయితే దాడుల తరువాత, తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ తమ ఆపరేషన్ ముగిసిందని ప్రకటించింది. కానీ పాకిస్థాన్ అధికారులు కాల్పుల విరమణ ప్రకటనను తిరస్కరించి తమ సైనిక కార్యకలాపాలను కొనసాగించారు. ఆ సమయంలో తాలిబన్ ప్రతినిధి అక్టోబర్ 12 ఉదయం వరకు పోరాటం కొనసాగిందని ధృవీకరించారు. ఈ దాడి కారణంగా రెండు దేశాలలో భారీగా ప్రాణనష్టం సంభవించిందని, అలాగే అనేక సరిహద్దు పోస్టులు నాశనం అయ్యాయని పలు నివేదికలు వెల్లడించాయి.

READ ALSO: Andhra King Thaluka: ఈసారి కింగ్ రామేనట.. సెన్సార్ రివ్యూ

Exit mobile version