Site icon NTV Telugu

Pakistan-Afghanistan Clashes: పాకిస్థాన్‌కు బిగ్‌ షాక్.. F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఆఫ్ఘాన్..! కానీ..

F16 Jet

F16 Jet

Pakistan-Afghanistan Clashes: పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి గందరగోళంగా మారింది. ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్‌ గజబ్‌ లిల్‌ హక్‌ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఇది పాకిస్థాన్‌కు బిగ్‌షాక్‌గా మారింది. ఆఫ్ఘాన్ గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానాన్ని తమ దళాలు కూల్చివేశాయని టోలో న్యూస్ (TOLOnews) వర్గాలు పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక దగ్ధమైన విమాన అవశేషాలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అది పాకిస్థాన్‌కు చెందిన F-16 యుద్ధవిమానం అని కొందరు పేర్కొన్నారు. వైరల్ వీడియోలో కనిపించిన విమాన అవశేషాలపై 85510 అనే సీరియల్ నంబర్, అలాగే పాకిస్థాన్ జెండా గుర్తు ఉన్నట్లు కనిపించింది.

READ MORE: Love Marriage: మూడు రోజుల క్రితం లవ్ మ్యారేజ్.. కట్ చేస్తే.. హాస్పిటల్ బెడ్ పై..!

కానీ.. కూలిన విమానం ఆకృతి, పరిమాణం F-16 యుద్ధవిమానానికి కొంత భిన్నంగా ఉంది. ఇది F-16 యుద్ధవిమానం కాదని కొందరు విశ్లేకులు చెబుతున్నారు. ఈ విమానం F-16 యుద్ధవిమానమేనా? అని తెలుసుకునేందుకు ఓ జాతీయ మీడియా సంస్థ సోషల్ మీడియా వేదిక Xలో ప్రాచుర్యం పొందిన గ్రోక్ బాట్‌ను సంప్రదించింది. ఈ అవశేషాలు F-16విగా కనిపించడం లేదని గ్రోక్ సమాధానమిచ్చింది. ఆఫ్ఘాన్ మీడియా కథనాల ప్రకారం.. శుక్రవారం పాకిస్థాన్ వైమానిక దాడులు తమ గగనతలాన్ని ఉల్లంఘించడంతో ప్రతిస్పందనగా ఆ విమానాన్ని కూల్చివేశామని చెబుతోంది. అయితే పాకిస్థాన్ మాత్రం మిలిటెంట్లపై లక్ష్యబద్ధమైన దాడులు చేసినట్లు అంగీకరించినా, తమవైపు ఎలాంటి విమాన నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దీంతో ఏ వార్త నమ్మాలో ఏ వార్త నమ్మకూడదో తేలియని పరిస్థితి ఏర్పాడింది!

READ MORE: East Godavari: పరువు హత్య కలకలం.. డిప్యూటీ తహశీల్దార్ భర్తను చంపిన సోదరులు.. ట్విస్ట్ ఏంటంటే?

ఇదిలా ఉండగా.. ఇటీవలి కొన్ని నెలలుగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఘర్షణల్లో రెండు వైపులా 70 మందికి పైగా సైనికులు మృతిచెందారు. అనంతరం భూసరిహద్దు దాదాపు మూసివేశారు. పాకిస్థాన్, తమపై దాడులు చేస్తున్న మిలిటెంట్ గుంపులపై ఆఫ్ఘాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తోంది. అయితే తాలిబాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని కాబూల్ సహా ఆఫ్ఘాన్ ప్రధాన నగరాలపై వైమానిక దాడులు జరిగాయని నివేదికలు సూచిస్తున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఈ పరిస్థితిని “ఓపెన్ వార్”గా అభివర్ణించగా, ప్రధానమంత్రి షరీఫ్ తమ సైన్యానికి ఏలాంటి చర్యలనైనా సమర్థ వంతంగా ఎదుర్కొనే పూర్తి సామర్థ్యం ఉందని హెచ్చరించారు.

Exit mobile version