NTV Telugu Site icon

Pakistan : పాలు తాగి ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి

Milk

Milk

Pakistan : పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో విషపూరితమైన పాలు తాగి ఒకే కుటుంబానికి చెందిన 13 మంది చనిపోయారు. ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మృతులను గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా గుర్తించారు. కుటుంబ పెద్దకు కొందరితో భూవివాదం ఉండటంతో బాధితులు విషం తాగి ఉంటారని కొందరు సన్నిహితులు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also:Tiger : కవాల్ రిజర్వ్ రాడార్ నుండి వలస వచ్చిన పులి అదృశ్యం.. అధికారుల ఆందోళన

పాలలో విషం ఉన్నట్లు గుర్తింపు
సకూర్‌లోని కెమికల్‌ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో కుటుంబ సభ్యులు చనిపోయిన రోజు తాగిన పాలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. మృతుల మృతదేహాల్లో విషపదార్థాలు ఉన్నట్లు కూడా నివేదికలో నిర్ధారించామని తెలిపారు.

Read Also:HCA: హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రూ.25 లక్షల ప్రైజ్ మనీ..

విచారణలో పోలీసులు
ఖైర్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) డాక్టర్ సమీవుల్లా సూమ్రో మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో జాగ్రత్తగా ముందుకెళ్తామని, అయితే ఘటనకు బాధ్యులైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.