NTV Telugu Site icon

Asia Cup 2023: పాకిస్థాన్‌, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరే జట్టేదో తెలుసా?

Sl Vs Pak

Sl Vs Pak

Sri Lanka Enters Asia Cup 2023 Final If PAK vs SL Match Cancelled: ఆసియా కప్‌ 2023 సూపర్‌-4 దశలో భాగంగా నేడు శ్రీలంకతో పాకిస్తాన్‌ తలపడుతుంది. రెండు వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. నేటి పోరులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఓడిన బంగ్లాదేశ్‌ ఫైనల్‌ రేసు నుంచి తప్పుకుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే నేటి మ్యాచ్‌లో విజేతగా నిలవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. అయితే పాకిస్థాన్‌, శ్రీలంక జట్లకు డూ ఆర్ డై అయిన ఈ మ్యాచ్‌కి వర్ఫం ముప్పు పొంచి ఉండడం గమనార్హం.

వరణుడు కరుణించి పాకిస్థాన్‌, శ్రీలంక మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు.. భారత్‌తో సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో తలపడనుంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచిన ఈ జట్ల ఖాతాలలో చెరో మూడు పాయింట్స్ ఉంటాయి. మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న లంక (-0.200) ఫైనల్ చేరుతుంది. పాకిస్తాన్ రన్‌రేట్ (-1.892) లంక కంటే తక్కువగా ఉంది.

Also Read: PAK vs SL: నేడు పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్.. భారత్‌ను ఢీకొట్టేదెవరు?

వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ లేనట్లే. ఒకవేళ నేటి మ్యాచ్‌లో పాక్ విజేతగా నిలిస్తే.. ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారిగా భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్‌ జరుగుతుంది. మరి వరణుడు ఏం చేస్తాడో చూడాలి. భారత్‌ చేతిలో చిత్తుగా ఓడడమే రన్‌రేట్‌లో పాక్‌ భారీగా వెనుకబడిపోయింది. మరోవైపు భారత్ చేతిలో ఓడినా చివరివరకు పోరాడడమే లంకకు కలిసొచ్చింది.