PAK vs BAN: బాధ పడటం లేదు.. ఆ విషయం రిజ్వాన్‌కు ముందే తెలుసు!
- 448-6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్
- సారథి అడ్డుపడ్డాడని విమర్శలు
- రిజ్వాన్ స్వయంగా సూచనలు చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saud Shakeel on Mohammad Rizwan: రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజున పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (171 నాటౌట్) భారీ సెంచరీ చేశాడు. 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 171 రన్స్ చేశాడు. రిజ్వాన్ మరో 29 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ పూర్తయ్యేది. కానీ పాక్ కెప్టెన్ షాన్ మసూద్ 448-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. దీంతో రిజ్వాన్ డబుల్ సెంచరీ చేయకుండా సారథి అడ్డుపడ్డాడని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
ఈ విమర్శలపై పాకిస్థాన్ క్రికెటర్ సౌద్ షకీల్ స్పందించాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసేందుకు గంట ముందే 450 స్కోరు దగ్గరగా చేయాలని మహ్మద్ రిజ్వాన్ కూడా సలహా ఇచ్చినట్లు చెప్పాడు. ‘రిజ్వాన్ డబుల్ సెంచరీ మిస్ అయిందనే బాధ మాకు లేదు. రిజ్వాన్ దాని గురించే ఆలోచించలేదు. ఇన్నింగ్స్ డిక్లేర్డ్ నిర్ణయంలో ఎలాంటి తొందరపాటు లేదు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసే గంట ముందే రిజ్వాన్ స్వయంగా సూచనలు చేశాడు. 450 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేద్దామనుకున్నాం. ఆ సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో రిజ్వాన్‌కు తెలుసు’ అని షకీల్ చెప్పాడు.
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
Also Read: Viral Video Today: ఆరు ప్రయత్నించి ఏడోసారి వదిలేశాడు.. క్యాచ్‌ను భలే వదిలేశావ్ భయ్యో!
రెడ్-బాల్ క్రికెట్లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న సౌద్ షకీల్ ఈ టెస్టులో 261 బంతుల్లో 141 పరుగులు చేశాడు. పాక్ స్కోర్ 114/4 ఉన్నపుడు షకీల్, రిజ్వాన్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఐదవ వికెట్‌కు 240 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో పాక్ భారీ స్కోర్ చేసింది. రెండోరోజు ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్ చేసింది. అభిమానులు మాత్రం రిజ్వాన్ డబుల్ సెంచరీ చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!