NTV Telugu Site icon

PAK vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.. మూడు మార్పులతో బరిలోకి పాకిస్తాన్! పరువు కోసం పోరాటం

Pakistan Vs Bangladesh Playing 11

Pakistan Vs Bangladesh Playing 11

Pakistan vs Bangladesh Playing 11 Out: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో మరో కొద్దిసేపట్లో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో పాక్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. ఇమామ్, షాదాబ్, నవాజ్ స్థానాల్లో ఫఖర్, సల్మాన్ మరియు ఉసామా ఆడుతున్నారని పేర్కొన్నాడు.

ఈ ఎడిషన్‌లో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లకు సెమీస్‌ అవకాశాలు లేవు. అయితే పరువు కోసం ఆడే ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌ మినహా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, భారత్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ చేతుల్లో బంగ్లా ఓడింది. మరోవైపు పాకిస్తాన్‌ ఆడిన 6 మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌, శ్రీలంకలపై మాత్రమే గెలిచి.. భారత్‌, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌, దక్షిణాఫ్రికా చేతుల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ 7, బంగ్లాదేశ్‌ 9వ స్థానంలో ఉన్నాయి.

తుది జట్లు:
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్.
బంగ్లాదేశ్‌: లిటన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం.