Site icon NTV Telugu

One Year of Pahalgam Terror Attack: ప్రతి భారతీయుడి కళ్లలో రక్తం ప్రవహించిన రోజిది.. అమరులైన 26 మంది పర్యాటకుల ఇదే నివాళి!

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

One Year of Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి నేటితో ఏడాది పూర్తయింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 10 ఏళ్ల బాలుడి నుంచి 80 ఏళ్ల ముసలాడి వరకు అందరి రక్తం మరిగింది. ఈ దాడిని చూసి దేశంలో ఉన్న మామూలు జనాల కళ్లలో రక్తం ప్రవహించిందంటే.. బార్డర్‌లో ఉన్న జవాన్లు ఎంతలా ఊగిపోయారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు.. ఆ పాకిస్థానీ ఉగ్రవాదులు భరతం పడతామని ఆగ్రహానికి లోనయ్యారు. 26 మందిని బలిగొన్న ఈ ఘటన ఎలా జరిగింది? ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం..

READ MORE: LSG vs RR Playing XI: తిరిగి విజయాల ట్రాక్ ఎక్కేదెవరో.?

అది ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం 2:45 గంటలు. ఇదే సమయంలో పహల్గామ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బైసారన్ లోయలో పర్యటకులు సరదాగా గడుపుతున్నారు. అక్కడికి కొంత మంది వ్యక్తులు వచ్చారు. వారు మిలిటరీ తరహా దుస్తులు ధరించారు. ఆ ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు అడవి నుంచి బయటకు వచ్చారు. పర్యాటకుల వద్దకు వెళ్లారు. “నువ్వు హిందువా? ముస్లిం హా?” అని అడిగారు. ఒకవేళ ముస్లిం అయితే.. కల్మా చదువమన్నారు. అంతేకాదు.. కొందరి ప్యాంట్లు విప్పి మరీ చెక్ చేశారు. హిందువులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణమైన దాడిలో 25 మంది భారతీయ పర్యాటకులు, ఒక నేపాలీ పర్యాటకుడు సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మగ పర్యాటకులు ఉన్నారు. ఇక ఇది మతం ప్రాతిపదికన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయిన ‘ది రిసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ దాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. 2019 ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా, 2008 ముంబై దాడుల తర్వాత పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా దీనిని పేర్కొన్నారు.

READ MORE: JD Chakravarthy: అందుకే హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి రానివ్వరు – జె.డి. చక్రవర్తి

ఈ దాడి అనంతరం అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ అనే పర్యాటకుడిని ఉగ్రవాదులు పహల్గామ్‌లో కాల్చి చంపారు. ఈ దాడి సమయంలో అతని భార్య పల్లవి, కుమారుడు అక్కడే ఉన్నారు. భర్తను చంపిన తర్వాత, తనను కూడా చంపమని పల్లవి వేడుకోగా.. ఉగ్రవాదులు తనను చంపకుండా, “వెళ్లి మీ మోడీకి చెప్పుకో” అని వ్యాఖ్యానించారు. ఇదంతా గమనించి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పాకిస్థాన్‌లో ఉగ్రమూఖలను ఏరివేయాలని నిర్ణయించుకుంది. భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను 2025 మే 7న ప్రారంభించింది. మే 7, 2025, అర్ధరాత్రి సుమారు 1:44 AM గంటలకు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు నిర్వహించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ముజఫరాబాద్, కోట్లి మరియు పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌పూర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఇది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సమన్వయంతో జరిగిన ‘ట్రై-సర్వీస్’ (Tri-services) ఆపరేషన్.

READ MORE: Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’లో 200 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. వీరిలో అత్యధికులు ఉగ్రవాదులు కాగా.. మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారు. ఈమేరకు రక్షణశాఖ వర్గాలు వెల్లడించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో ముఖ్యంగా బహవల్‌పుర్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రముఠా ప్రధాన కేంద్రం తీవ్రంగా ధ్వంసమవ్వగా.. ఇక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యం, CRPF, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ మహాదేవ్’ చేపట్టారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులను లేపేశారు. సులేమాన్ అలియాస్ ఫైజల్ జాట్ (Suleman alias Faizal Jatt), హంజా ఆఫ్ఘని (Hamza Afghani), జిబ్రాన్ (Zibran) అనే ఉగ్రవాదులను లేపేశారు.

READ MORE: Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

పహల్గాం దాడిలో మరణించిన వారి జాబితా!
దిలీప్‌ దేసాలే – మహారాష్ట్ర, ముంబయి
హేమంత్ జోషి సుహాస్‌ – మహారాష్ట్ర, ముంబయి
అతుల్‌ శ్రీకాంత్ మోని – మహారాష్ట్ర, థానే
సంజయ్‌ లక్ష్మణ్ లేలే – మహారాష్ట్ర, థానే
సంతోష్‌ జగ్దాలే – మహారాష్ట్ర, పుణె
కస్టోబే గనోవోటే – మహారాష్ట్ర, పుణె
బిటన్ అధికారి – పశ్చిమ బెంగాల్‌, కోల్‌కతా
సమీర్ గుహ – పశ్చిమ బెంగాల్‌, కోల్‌కతా
మనీశ్‌ రంజన్‌ (ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌) – పశ్చిమ బెంగాల్‌, పురులియాలోని ఝల్దా
మధుసూదన్‌ సోమిశెట్టిరావు – కర్ణాటక, బెంగళూరు
భరత్‌ భూషణ్ – కర్ణాటక, బెంగళూరు
మంజునాథరావు – కర్ణాటక, శివమొగ్గ
యతీశ్‌ పర్మార్‌ – గుజరాత్, భావ్‌నగర్‌
సుమిత్‌ పర్మార్‌ (యతీశ్‌ కుమారుడు) – గుజరాత్, భావ్‌నగర్‌
సైలేష్‌ భాయ్‌ కలథియా – గుజరాత్‌, సూరత్‌
వినయ్ నర్వాల్‌ (నేవీ అధికారి) – హరియాణా, కర్నాల్‌
ఎన్. రామచంద్రన్ – కేరళ, కొచ్చి
దినేశ్ అగర్వాల్‌ – చంఢీగఢ్‌
సయ్యద్ ఆదిల్‌ హుస్సేన్‌ షా – జమ్మూకశ్మీర్‌, పహల్గామ్‌
నీరజ్ ఉద్వానీ – ఉత్తరాఖండ్‌
జేఎస్‌ చంద్రమౌళి – ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నం
సుశీల్‌ నాథ్యాల్‌ – మధ్యప్రదేశ్‌, ఇండోర్‌
ప్రశాంత్ సతపతి – ఒడిశా, బాలేశ్వర్‌
టేజ్‌ హాల్వింగ్‌ (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ కార్పొరల్‌) – అరుణాచల్‌ప్రదేశ్‌, జిరో
శుభం ద్వివేదీ – ఉత్తరప్రదేశ్‌, కాన్పూర్‌
సుదీప్‌ సోయిపాని – నేపాల్‌, రూపందేహి

Exit mobile version