పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. చెట్లను పెంచండి అంటూ చిన్న తనం నుంచే ప్రచారం చేస్తూ చెట్లు నాటుతూ సేవ చేసిన దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య. వనజీవి రామయ్య మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రకృతి ప్రేమికులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Vijayashanti: నటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు
ప్రస్తుతం మన ముందు ఉన్న సవాల్ పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే అని, అందుకు పరిష్కారం ఉన్న అడవులు కాపాడుతూ, కొత్తగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచటమే అని రామయ్య ప్రజలకు పిలుపునిచ్చి చెట్ల పెంపకానికి ఎంతో కృషి చేశారు. వనజీవి రామయ్య, జానమ్మ దంపతులు కోటికి పైగా మొక్కలు నాటారు. రామయ్య సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2018 లో ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వనజీవి రామయ్య. ప్రభుత్వం, ప్రైవేట్ అవార్డులు, 3వేల షీల్డులు పొందారు వనజీవి రామయ్య.