కూటమిలో టికెట్ల కేటాయింపుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. టికెట్ కోసం ఆశావహులు రచ్చకెక్కుతున్నారు. ఈ క్రమంలో మన్యం జిల్లా పాలకొండ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇంచార్జ్ జయకృష్ణకు వ్యతిరేకంగా పడాల భూదేవి వర్గం సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. మీడియా సమావేశంలో జనసేన నేత పడాల భూదేవి కన్నీటి పర్యంతమయ్యారు. టికెట్ ఇస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మాట తప్పారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరి క్షణంలో జయకృష్ణకు టికెట్ కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: AP Elections 2024: ఎన్నికల వేళ ఏపీలో భారీగా పట్టుబడుతున్న మద్యం, డబ్బు, గంజాయి..
కాగా.. పది రోజుల క్రితమే టీడీపీని వీడి జనసేనలో జాయిన్ అయ్యారు నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి. అయితే.. టీడీపీలో ఉన్న సమయంలోనూ వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. టీడీపీ నుంచి జనసేనలోకి మారిన తర్వాత ఇప్పుడు టికెట్ విషయంలో విభేదాలు భగ్గుమంటున్నాయి. చూడాలి మరీ.. పడాల భూదేవి విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్నది ఉత్కంఠగా మారింది.