Site icon NTV Telugu

OYO Offer: ‘ఓయో’ స్పెషల్ ఆఫర్.. అమ్మాయిలకు మాత్రమే..!!

Oyo Min

Oyo Min

ఆకర్షణీయమైన గదులతో ఆతిథ్యం అందించే ఓయో సంస్థ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈనెల 17న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్ష కోసం 18 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఓయో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు తమ హోటళ్లలో 60 శాతం రాయితీ ఇస్తామని తెలిపింది. అయితే ఇది అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందని ఓయో వెల్లడించింది. ఈ ఆఫర్ ఈనెల 16, 17 తేదీల్లోనే వర్తిస్తుందని వివరించింది. ఈ రాయితీ పొందాలనుకునేవారు తొలుత తమ ఫోన్లలో ఓయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ను ఓపెన్ చేసి నియర్ బై ఐకాన్ క్లిక్ చేస్తే సదరు విద్యార్థిని పరీక్ష రాసే కేంద్రానికి సమీపంలోని ఓయో హోటళ్ల జాబితా వస్తుంది. అందులో నచ్చిన హోటల్‌ను ఎంచుకుని కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే రాయితీ వస్తుంది.

Read Also: Viral News: రియల్ బాహుబల్ ఏనుగు.. 3కి.మీ. ఈది ప్రాణాలు కాపాడింది..

ముఖ్యమైన పరీక్ష కేంద్రాల్లో వసతి అవసరాలను అందించడం ద్వారా విద్యార్థినులకు మద్దతుగా నిలిచేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నట్లు ఓయో సంస్థ అభిప్రాయపడింది. విద్యార్థులు ఎంచుకొనే హోటళ్లలో వైఫైతో పాటు ఏసీ సదుపాయాలు కూడా ఉంటాయని ఓయో తెలిపింది. కాగా గతంలోనూ తమ హోటళ్లలో పనిచేసే చిరువ్యాపారుల కోసం ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయో 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. గత నెల 27 నుంచి ఈనెల 3 వరకు ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే.

Exit mobile version