NTV Telugu Site icon

Oyo Bookings: ఓయోలో రికార్డు బుకింగ్స్.. వాలెంటైన్స్ డే పుణ్యమా అని!

10

10

వాలెంటైన్స్ డే పుణ్యమా అని హోటల్ రూమ్ బుకింగ్స్ సేవలు అందించే ఓయోకు మంచి బిజినెస్ జరిగింది. ఏకాంతంగా తమ ప్రేమను ఒకరికొకరు పంచుకునేందుకు ఆసక్తి చూపిన వినియోగదారులతో యాప్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతంతో పోలిస్తే ఈ సారి ఏకంగా 35 శాతం పెరుగుదల కనిపించింది. వీక్ డే అయినప్పటికీ ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం పట్ల ఓయో ప్రతినిధులే ఆశ్చర్యపోతున్నారు. కంపెనీ డేటా ప్రకారం ఏ నగరంలో ఎక్కువ బుకింగ్స్ జరిగాయో వివరాలు వెల్లడయ్యాయి.

Also Read: UPI Lite: పేటీఎం నుంచి అదిరిపోయే ఫీచర్..బ్యాంక్‌తో సంబంధం లేకుండానే!

అయితే, ఏ గోవానో లేదా ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన మనాలీనో కాకుండా యూపీలోని బృందావనంలో అత్యధిక రూమ్స్ బుక్కవ్వడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే అక్కడ ఏకంగా 231 శాతం పెరగడం మారిన యువత ఆలోచనకు నిదర్శనమని భావిస్తున్నారు. ఇకపోతే, బెంగళూరు 51 శాతంతో రెండో స్థానంలో, హైదరాబాద్ 47 శాతంతో మూడో స్థానంలో, 38 శాతంతో కోల్‌కతా నాలుగో ప్లేస్‌ల్లో ఉన్నాయి. తర్వాత ముంబై, చెన్నై వంటి నగరాలున్నాయి. మరో విశేషమేంటంటే 2022లో రూం బుక్ చేసుకున్న వారు సగటున రెండు రోజులు గడిపితే.. అది ఈ సారి రెట్టింపై నాలుగు రోజులకు పెరగడం. ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడానికి ఖర్చుకు వెనకాడని మధ్యతరగతి జనం కూడా కారణమని భావిస్తున్నట్టు ఓయో అభిప్రాయపడింది.

Also Read: Pavitra: మా నాన్న చనిపోయాడని తెలిసి సంతోషించా.. జబర్దస్త్ నటి సంచలన వ్యాఖ్యలు