NTV Telugu Site icon

Palestine protests effect: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి తాళం

Lock

Lock

గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల నిరసనలతో అగ్రరాజ్యం అమెరికాలోని యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇప్పటికే పలు యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలువురు విద్యార్థులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు యూనివర్సిటీల నుంచి బహిష్కరణకు కూడా గురయ్యారు. అయినా కూడా నిరసనకారుల్లో మార్పు రాలేదు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలు తెంచుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిరసనకారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంతేకాకుండా భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భవనానికి అధికారులు తాళం వేశారు.

ఇది కూడా చదవండి: AP High Court: హై కోర్టు కీలక ఆదేశాలు..పిన్నెల్లి సహా ఇతర అభ్యర్థులపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి సంబంధించిన విధానాలను సమీక్షించడానికి విశ్వవిద్యాలయంలో సమావేశం కావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. వందలాది మంది నిరసనకారులు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యూనివర్సిటీ భవనానికి తాళం వేశారు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: పెళ్లి ఇంట్లో మహిళలు డ్యాన్స్ చేస్తుండగా రెచ్చిపోయిన పోకిరీలు..

అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడింది. కొంత మంది ఇజ్రాయెల్స్‌ను అపహరించుకుని పోయింది. దీంతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. అనంతరం రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ లక్ష్యంగా దాడులకు పాల్పడింది. గాజా పట్టణాన్ని సర్వనాశనం చేసింది. ప్రస్తుతం రఫా లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు అగ్ర రాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇదే పాలస్తీనా విద్యార్థులకు రుచించలేదు. తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని అమెరికాలో ఆందోళనలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Thane Explosion: 8కి చేరిన మృతులు.. 60 మందికి గాయాలు