Site icon NTV Telugu

Dog : ఆత్మహత్య చేసుకున్న యజమానిని రక్షించేందుకు 4గంటలు పోరాడిన కుక్క

New Project (3)

New Project (3)

Dog : ‘కుక్కకు ఉన్న విశ్వాసం నీకు లేదు’ అంటాం. నిజానికి కుక్కను కాస్త అన్నంపెట్టి ఆదరిస్తే చాలు చచ్చేంత వరకు విశ్వాసం చూపిస్తుంది. తన యజమానికి ఏ అపాయం ఎదురైన తన శాయశక్తులా కాపాడుకునేందుకు పోరాడుతుంది. అలాగే ఓ కుక్క తన యజమాని ఉరేసుకోబోతుండగా నాలుగు గంటలపాటు కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ తన వల్ల కాలేదు.. చివరికి పోలీసులు, పొరుగు వారు వచ్చి యజమాని మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. తన యజమాని మరణాన్ని తట్టుకోలేక ఆ శునకం కాసేపటికే చనిపోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ జిల్లా కేంద్రంలోని పంచవటిలోని పోష్ కాలనీలో సంభవ్‌ అగ్నిహోత్రి(25) అనే యువకుడు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అతడి తల్లి కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో తండ్రి ఆనంద్ అగ్నిహోత్రి రైల్వే ఉద్యోగి. ఆమెను తీసుకొని భోపాల్ వెళ్లాడు. దీంతో స్థానిక నలంద గార్డెన్ లో సంభవ్ ఒంటరిగా చాలా సేపు కూర్చొని ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో తండ్రి ఆనంద్ కొడుకుకు ఫోన్ చేశాడు.. ఎన్ని సార్లు చేసినా సంభవ్ ఎత్తలేదు.

Read Also:Tomato Prices Down: టమోటా రైతుల ఆవేదన.. కేజీ 2 రూపాయలే

ఇంటికి వెళ్లిన తరువాత అగ్నిహోత్రి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అయితే దీనిని అతడి పెంపుడు కుక్క అలెక్స్‌ గమనించింది. దానికి చేతగాకపోయినా యజమానిని కాపాడేందుకు తీవ్రంగా యత్నించింది. ఈ క్రమంలో కుక్క బాగా అరిచింది. ఈ అరుపులు పక్కింట్లో నివసించేవారికి వినిపించాయి. ఇదే సమయంలో తండ్రి చుట్టుపక్కల నివసించే వారికి కాల్ చేశాడు. తమ కుమారుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, వెంటనే ఇంటికి వెళ్లి చూడాలని సూచించాడు. దీంతో వారందరూ ఇంటికి వెళ్లి చూశారు. వారు వెళ్లి చూసేసరికి ఓ గదిలో అగ్నిహోత్రి ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. అయితే వారిని ఆ శునకం లోపలికి రానివ్వలేదు. దీంతో వారంతా కలిసి పోలీసులకు ఫోన్ చేశారు. వారిని కూడా అలెక్స్ అడ్డుకుంది. చివరికి దానికి మత్తు మందు ఇచ్చి లోపలికి వెళ్లారు. అగ్నిహోత్రి బట్టలపై, కాళ్లపై గీతలు కనిపించాయి. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. అయితే మృతుడు తన పుస్తకాల్లో పలు విషయాలు రాసుకొచ్చాడు. తాను గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానని బాధపడ్డాడు. కాగా.. అప్పటి నుంచి తీవ్ర ఒత్తిడితో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు లేని సమయంలో చూడా అతడు ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జరిగిన కొంత సమయానికే అలెక్స్ కూడా చనిపోయింది. అయితే మత్తు మందు డోస్ ఎక్కువవడంతోనే అది మరణించదని స్థానికులు ఆరోపించారు. ఒకే రోజు కుమారుడు, పెంపుడు జంతువు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. ఆ కాలనీ మొత్తం విషాదంలో మునిగిపోయింది.

Read Also:Chikoti Praveen: 12వ తేదీ రావాల్సిందే.. చీకోటికి మరోసారి ఈడీ నోటీసులు..

Exit mobile version