ఏపీలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వేకి అనూహ్య స్పందన లభిస్తోంది. 14వ రోజు గురువారం ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రజలు స్పందించారు. నిన్న ఒక్కరోజు 98 లక్షల గృహాలకు ఈ పథకం చేరింది. 75 లక్షల మంది స్పందించి మిస్ డ్ కాల్స్ ఇచ్చి జగన్ సందేశాన్ని విన్నారు. ఈ తరహాలో గతంలో ఏ సర్వేకి అంత ఆదరణ లభించలేదు. నేనున్నాను.. నేను విన్నాను అంటూ తన పాలనతో ప్రజలకు చేరువ అయ్యారు జగన్. నాలుగేళ్ల పరిపాలనలో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్రజా మద్దతు లభిస్తోంది. వైయస్ఆర్ సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన `జగనన్నే మా భవిష్యత్తు` కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని వైసీపీ తెలిపింది.
Read Also: YS Viveka Case Live Updates: వివేకా రెండో భార్య షేక్ షమీమ్ హాట్ కామెంట్స్
విభిన్న రకాల సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రతీ కుటుంబం జగనన్న పాలనకు జై కొడుతోంది.. `మా నమ్మకం నువ్వే జగన్` అంటోంది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టిన 14 రోజుల్లో కోటికి పైగా కుటుంబాల్లో సర్వే నిర్వహించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. కోటి మార్క్‌ను దాటడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, గత చంద్రబాబు పాలనకు గల తేడాను వివరిస్తూ గృహ సారథులు సర్వే చేస్తున్నారు. మ్యానిఫెస్టో అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి గ్రామంలో సందడి నెలకొంది. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు సీఎం వైయస్ జగన్ ప్రతినిధులుగా ఇంటింటికీ వెళ్తున్నారు.
నవరత్నాలు వంటి వివిధ రకాల సంక్షేమ పాలనను వివరిస్తూ ప్రజాసర్వే చేపట్టి.. వారి అనుమతి మేరకు ఇంటింటికీ `మా నమ్మకం నువ్వే జగన్` స్టిక్కర్లు అంటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రజలు వైయస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నాటికి 70 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రజల స్పందన చూస్తుంటే మరోసారి జగన్ కి అఖండ మెజారిటీ ఖాయం అంటోంది పార్టీ. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకు నచ్చేలా, కోట్లాదిమంది మెచ్చేలా పాలన సాగుతోందని వైసీపీ పేర్కొంది.
Read Also: YSR Crop Insurance Scheme: డాక్టర్ వైఎస్సార్ పంటల బీమా పథకానికి జాతీయస్ధాయి గుర్తింపు