NTV Telugu Site icon

World Sleep Day : అతిగా నిద్ర పోతే.. మీరు ఉబ్బిపోతారు జాగ్రత్త

Sleeping

Sleeping

World Sleep Day : ఆరోగ్యంగా ఉండాలంటే సంతులిత ఆహారం, వ్యాయామంతో పాటు తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరు రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తరచుగా వింటూ ఉంటారు. అయితే తక్కువ నిద్రపోవడమే కాకుండా అతిగా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా అతిగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు గురించి తెలుసుకుందాం. అధిక నిద్ర అన్ని శరీర విధులను నెమ్మదిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. దీంతో ఒక వ్యక్తిని ఊబకాయానికి గురి చేస్తుంది. భవిష్యత్తులో ఈ ఊబకాయం అనేక తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది.

గుండె వ్యాధి
ఎక్కువ నిద్రపోయే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక పరిశోధన ప్రకారం, 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని రెట్టింపు చేయవచ్చు.

మధుమేహం
మీరు కూడా నిర్ణీత సమయం కంటే ఎక్కువ నిద్రపోతే, అది మధుమేహానికి దారి తీస్తుంది. నిజానికి, ఎక్కువ నిద్రపోవడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

వెన్నునొప్పి
ఎక్కువ కాలం తాగే అలవాటు ఉంటే వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా గంటల తరబడి కంప్యూటర్‌లో పనిచేసి ఎక్కువసేపు నిద్రపోయేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి స్థితిలో, ప్రజలకు శారీరక శ్రమకు సమయం లభించదు. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. వెన్నునొప్పి సమస్య మొదలవుతుంది.

డిప్రెషన్
ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. నిజానికి, ఎక్కువ నిద్ర బద్ధకం, సోమరితనం పెరుగుతుంది. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ఉత్సాహం, సానుకూలత తగ్గుతాయి. డిప్రెషన్ కు కూడా దారి తీస్తుంది.

Show comments