Fake coins: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బస్తాలకొద్ది నకిలీ నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నాణేలపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో రూ.9 లక్షలకు పైగా విలువైన నకిలీ రూ.1, రూ.5, రూ.10 నాణేలు లభ్యమయ్యాయి. మలాద్ ప్రాంతం వల్లభ్ బిల్డింగ్ మీదుగా వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా, అందులో కొన్ని ఫేక్ కాయిన్స్ బస్తాలు పట్టుబడ్డాయి. వాటిని పోలీసులు తెరిచి చూడగా అందులో నాణేలు దొరికాయి. జిగ్నేశ్ గాలా అనే 42 ఏళ్ల ఓ వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు.
Read Also: Child Marriages: బాల్యవివాహాలు చేసుకుంటే అరెస్టులే.. సీఎం సంచలన ప్రకటన
అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. మొత్తం రూ.9.46 లక్షల నకిలీ నాణేలు దొరికాయని చెప్పారు. హరియాణాలో నకిలీ నాణేల కర్మాగారం ఉంది. దానిపై దాడి చేసిన స్పెషల్ సెల్ అధికారులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారని పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముంబైకి కారులో పెద్ద ఎత్తున నకిలీ నాణేలు వెళ్లాయని గుర్తించి అక్కడకు వెళ్లి పట్టుకున్నామని చెప్పారు. ప్రార్థనా మందిరాల వద్ద నిందితులు నకిలీ నాణేలను మార్చుతున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. ఈ వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతోందన్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు.
Read Also: Pawan Kalyan: మూడో విడత సభ్యత్వ నమోదు…క్యాడర్ కు పవన్ రిక్వెస్ట్