Site icon NTV Telugu

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో కుప్పకూలిన పాదచారుల వంతెన.. 80 మందికి గాయాలు

Foot Bridge

Foot Bridge

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని ఉదమ్‌పూర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాదచారుల వంతెన కుప్పకూలిన ఘటనలో 80 మందిగాయాలపాలయ్యారు. ఉధంపూర్‌లోని చెనాని బ్లాక్‌లోని బైన్ గ్రామంలోని బేని సంగమ్‌లో బైసాఖి వేడుకల సందర్భంగా పాదచారుల వంతెన కూలిపోయిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినోద్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బైశాఖీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు పాదచారుల వంతెనపైకి ఒక్కసారిగా రావడంతో అది కుప్పకూలినట్లు డివిజినల్‌ కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనలో దాదాపు 80 మంది గాయపడ్డారని చెనాని మునిసిపాలిటీ ఛైర్మన్‌ మాణిక్ గుప్తా తెలిపారు. వారిలో 20-25 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. తాము 6-7 మందిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశామన్నారు.

 

Exit mobile version