Egypt Temple: ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 2,000 లకు పైగా మమ్మీ చేయబడిన గొర్రె తలలను కనుగొన్నారు. ఆ గొర్రె తలలను ఫారో రామ్‌సెస్ II ఆలయంలో ప్రసాదంగా ఉంచినట్లు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసల మమ్మీలను కూడా న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి వెళ్లిన యూఎస్ పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం అబిడోస్ వద్ద వెలికితీసింది. ఇది దక్షిణ ఈజిప్టులోని దేవాలయాలు, సమాధులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం.
అమెరికన్ మిషన్ అధిపతి సమేహ్ ఇస్కందర్ మాట్లాడుతూ.. రామ్‌సేస్ II మరణించిన 1,000 సంవత్సరాల తర్వాత జరుపుకునే ఆరాధనను సూచిస్తూ రామ తలలు “అర్పణలు” అని చెప్పారు. క్రీ.పూ 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు రామ్‌సెస్ II ఈజిప్టును పాలించాడు. ఈ ఆవిష్కరణలు 2374-2140 బీసీ మధ్య, టోలెమిక్ కాలం 323 నుంచి 30 బీసీ వరకు రామ్‌సెస్ II ఆలయం గురించి, అక్కడ జరిగిన కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడతాయని ఈజిప్ట్‌లోని పురాతన వస్తువుల సుప్రీం కౌన్సిల్ అధిపతి మోస్తఫా వాజిరి చెప్పారు. అలాగే మమ్మీ చేయబడిన జంతువుల అవశేషాలతో పాటు దాదాపు 4,000 సంవత్సరాల క్రితం నాటి ఐదు మీటర్ల మందం (16 అడుగుల) గోడలతో కూడిన ప్యాలెస్ అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు అనేక విగ్రహాలు, పాపిరి, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లు కూడా కనుగొన్నారు. కైరోకు దక్షిణంగా ఉన్న అబిడోస్ ఆలయాలకు ప్రసిద్ధి చెందింది.
Read Also: Atiq Ahmed: ప్రయాగ్‌రాజ్ జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్‌కు అతిక్ అహ్మద్!
ఈజిప్టు క్రమం తప్పకుండా కొత్త పురావస్తు ఆవిష్కరణలను ప్రకటిస్తుంది. ఇది వారి శాస్త్రీయ లేదా చారిత్రాత్మక ప్రాముఖ్యత కంటే రాజకీయ, ఆర్థిక ప్రభావం కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 105 మిలియన్ల మందికి నివాసంగా ఉన్న ఈజిప్ట్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ దేశం ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడింది. పర్యాటకమే రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారికి ముందు 13 మిలియన్లతో పోలిస్తే, 2028 నాటికి సంవత్సరానికి 30 మిలియన్ల మంది సందర్శకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పర్యాటకాన్ని పునరుద్ధరించాలని కైరో భావిస్తోంది.