NTV Telugu Site icon

Flash Floods: వరదల బీభత్సం..200 మందికి పైగా మృతి

Floods In Congo

Floods In Congo

Flash Floods Congo: ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోల వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్నిరోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వానలతో దక్షిణ కివు ప్రావిన్స్‌లో నదులకు వరదలు పోటెత్తాయి. దీంతో బుషుషు, న్యాముకుబి వంటి గ్రామాలను నదులు ముంచెత్తాయి. ఈ వరదల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 మందికిపైగా మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 2227 మృతదేహాలను గుర్తించినట్లు సివిల్‌ సొసైటీ సభ్యుడు కసోల్‌ మార్టిన్‌ వెల్లడించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, ఇళ్లు వరదలకు తుడిచిపెట్టుకుపోయాయని వెల్లడించారు. నిలువ నీడలేకపోవడంతో ప్రజలు ఆరుబయటే నిద్రిస్తున్నారని పేర్కొన్నారు.

Read Also: Islamabad Meeting: ఇస్లామాబాద్ సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం

భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని నదులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలు మునిగిపోయాయని, చాలా ఇళ్లు కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఈ మేరకు నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత డెనిస్‌ ముక్వేగే ప్రకృతి విపత్తులో నిరాశ్రయులైన ‍ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించేలా వైద్యులను, సాంకేతిక నిపుణలను ఆయా ‍ప్రాంతాలకు పంపినట్లు ‍ప్రకటించారు.దక్షిణ కివూలో వరదలు, కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణమని అధికారులు తెలిపారు. 2014లో కూడా ఇంటి ప్రకృతి విపత్తే సంభవించిందన్నారు. భారీవర్షాలకు 7 వందలకుపైగా ఇండ్లు తుడిచిపెట్టుకుపోగా, 130 మందికిపైగా కనిపించకుండా పోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గత నెలలో కురిసిన వాలనకు కొండచరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు. దేశ రాజధాని కిన్‌షాసాలో డిసెంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో 169 మంది మృతిచెందారు.