Site icon NTV Telugu

Chandigarh: 1,700కు పైగా గర్భస్రావ కిట్లు స్వాధీనం.. ఎఫ్ఐఆర్‌ నమోదు..!

Abortion Kits

Abortion Kits

Chandigarh: హర్యానా రాష్ట్రంలో అక్రమంగా అమ్ముడవుతున్న మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MPT) కిట్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతవారం జరిగిన ఈ తనిఖీలలో మొత్తం 1,787 ఎంపీటీ కిట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు అధికారులు. ఈ విషయాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుధీర్ రాజపాల్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర లింగ నిష్పత్తి అభివృద్ధి బృందం వారపు సమావేశంలో వెల్లడించారు.

Read Also: IPL 2025 Playoffs: ఐపీఎల్‌ 2025 ప్లేఆఫ్స్‌.. క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌లో తలపడే టీమ్స్ ఇవే!

ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ గర్భస్రావాలపై గట్టి చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వైద్యులపై లైసెన్స్ రద్దు వరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మే 20 నుంచి 26 వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో 1,787 ఎంపీటీ కిట్లు స్వాధీనం కాగా, మూడు షాపులు మూసివేయబడ్డాయని ఆయన తెలిపారు. అలాగే, ఒక నెల వ్యవధిలో ఎంపీటీ కిట్లు విక్రయిస్తున్న హోల్‌సేల్ డీలర్ల సంఖ్య 32 నుంచి 6కి తగ్గించామని వారు తెలిపారు.

Read Also: SpaceX: స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ ప్రయోగం సక్సెస్.. కానీ భూమికి తిరిగి రాకముందే..

ఈ తనిఖీల్లో మూడు అధిక ధరలకు అమ్మకాలు, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్, 1945 ప్రకారం రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఎంపీటీ కిట్ల విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఇకపై ప్రతి మంగళవారం సీనియర్ మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలోని మెడికల్ ఆఫీసర్లతో సమావేశమవ్వాలని, ప్రతి బుధవారం జిల్లా మెడికల్ అధికారి (CMO)లు సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 122 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో 686 సబ్-రిజిస్ట్రార్‌లను నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version