Site icon NTV Telugu

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కూలిన వంతెన.. కార్మికులకు గాయాలు

Birdge

Birdge

మధ్యప్రదేశ్‌లో పురాతన వంతెన హఠాత్తుగా కూలిపోయింది. దీంతో పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో మంగళవారం దాదాపుగా 100 ఏళ్ల నాటి బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారని అధికారి తెలిపారు. కార్మికులు వంతెనపై కూర్చొని ఉండగా ఒక్కసారిగా గోడ విరిగిపడిందని జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మొరెనా జిల్లాలో క్వారీ నదిపై 100 ఏళ్ల క్రితం రైల్వేశాఖ ఈ వంతెనను నిర్మించింది. అయితే ఈ బ్రిడ్జ్‌ను కొత్తగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. కార్మికులు పనులు చేస్తుండగా ఈ వంతెన సడన్‌గా కూలిపోయింది. ఇనుప నిర్మాణాన్ని కూల్చివేయడానికి కార్మికులు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగిస్తుండగా వంతెన కూలినట్లు సమాచారం. దీంతో బ్రిడ్జి మీద ఉన్న ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారు మొరెనాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన కైలారస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్రోడా గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Tata-BMW: బీఎండబ్ల్యూతో టాటా టెక్నాలజీస్ జాయింట్ వెంచర్..

Exit mobile version