NTV Telugu Site icon

Tamilnadu : రెండు రౌండ్ల కౌన్సెలింగ్ అయినా మిగిలిపోయిన లక్ష ఇంజినీరింగ్ సీట్లు

New Project 2024 08 24t134317.395

New Project 2024 08 24t134317.395

Tamilnadu : తమిళనాడు ఇంజినీరింగ్ అడ్మిషన్ (TNEA) రెండో రౌండ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి చేసింది. తర్వాత మొత్తం 443 కాలేజీల్లో 110 కాలేజీలు సింగిల్ డిజిట్‌లో మాత్రమే సీట్లను నింపగలిగాయి. 30 ఇతర కళాశాలల్లో సీట్లు భర్తీ కాకపోవడంతో విద్యావేత్తలు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కొద్ది మంది విద్యార్థులు మాత్రమే అలా అవ్వడంతో ఈ సంస్థలకు నాణ్యమైన విద్యను అందించడం కష్టమని పేర్కొన్నారు. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ ముగిసే సమయానికి మొత్తం సీట్లు 1,62,392లో మొదటి రౌండ్ లో 17,679 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 61,082 (37.6%) మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 1,01,310 సీట్లు మూడవ రౌండ్‌కు అందుబాటులో ఉంటాయి. ఇందులో 93,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారు. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 55,000-60,000 సీట్లు ఖాళీగా ఉంటాయని మునపటి కౌన్సిలింగ్ ట్రెండులు చూస్తే అర్థం అవుతుంది.

Read Also:Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..

కెరీర్ కన్సల్టెంట్ జైప్రకాష్ గాంధీ మాట్లాడుతూ.. గతేడాది కూడా అన్నా యూనివర్సిటీ పేలవమైన ఎన్‌రోల్‌మెంట్ కారణంగా కొన్ని కాలేజీలను మూసివేయాల్సి వచ్చింది. ఈ కాలేజీలు విద్యార్థులను ఆకర్షించడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నాయనే విషయాన్ని విశ్వవిద్యాలయం పరిశీలించాలి. మెరుగుపరచడానికి పరిష్కారాలను సూచించాలి. ఈ ఏడాది కనీసం 197 కాలేజీలు 10శాతం సీట్లను కూడా భర్తీ చేయలేకపోయాయి. అయితే 114 కాలేజీలు మాత్రమే 50శాతం కంటే ఎక్కువ సీట్లను భర్తీ చేయగలిగాయి. వీటిలో 57 కాలేజీలు మాత్రమే 80శాతం కంటే ఎక్కువ సీట్లు భర్తీ చేయగా, 39 కళాశాలలు 90శాతం నమోదు చేసుకున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, MIT క్యాంపస్ (అన్నా యూనివర్సిటీ), CEG క్యాంపస్ (అన్నా యూనివర్సిటీ), స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (BPlan కోసం) కేవలం నాలుగు ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే 100శాతం సీట్లను భర్తీ చేయగలిగాయి.

Read Also:HYDRA: తుమ్మిడి చెరువు మరోవైపు ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా..

మొదటి రౌండ్ నుండి 475 మంది విద్యార్థులు రెండవ రౌండ్‌లో కేటాయింపులు పొందారు. ఇది మునుపటి సంవత్సరాలలో సాధారణ 200-250 కంటే ఎక్కువ. “మొదటి రౌండ్ విద్యార్థులు వారి ఆప్షన్లను సరిగ్గా పెట్టుకోలేదని వారి కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్నారని ఇది సూచిస్తుంది. విద్యార్థులు తమ కళాశాలలను తెలివిగా ఎంచుకోవాలి” అని అన్నా యూనివర్సిటీకి చెందిన ఒక అధ్యాపక సభ్యుడు తెలిపారు. ఈ సంవత్సరం కూడా విద్యార్థులు కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్‌కు బదులుగా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ECE, IT వంటి వాటికి డిమాండ్ రెండవ రౌండ్‌లో తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.