Site icon NTV Telugu

Oval Test: ఓవల్ టెస్ట్ విజయం.. భారత్ సరికొత్త రికార్డ్!

India Narrowest Test Win

India Narrowest Test Win

India Narrowest Wins in Test Cricket: భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టెస్ట్ ఫార్మాట్‌లో అతి తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందడంతో భారత్ ఈ ఫీట్ సాధించింది. 2004లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు భారత్‌ లోయెస్ట్ మార్జిన్ విజయం ఇదే. ఓవల్‌ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించడంతో 21 ఏళ్ల రికార్డ్‌ను టీమిండియా తిరిగరాసింది.

1972లో ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్ట్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2018లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ మైదానంలో 31 రన్స్ తేడాతో గెలుపొందింది. తాజాగా టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు ఇది నాలుగో లోయెస్ట్ మార్జిన్ ఓటమి. అంతకుముందు న్యూజిలాండ్ (1 రన్, వెల్లింగ్టన్-2023), ఆస్ట్రేలియా (3 రన్స్, మాంచెస్టర్-1902), ఆస్ట్రేలియా (6 రన్స్, సిడ్నీ-1885)పై తక్కువ పరుగుల తేడాతో ఓడింది.

Also Read: Horoscope Today: మంగళవారం దినఫలాలు.. ఆర్ధిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్త!

ఓవల్‌లో ఐదు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన పోరులో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. గొప్పగా పోరాడిన భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో 367 పరుగులకు ఇంగ్లీష్ టీమ్ ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్‌ (5/104), ప్రసిద్ధ్‌ కృష్ణ (4/126) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 224 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ 247 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 396 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ 367 రన్స్ చేసింది. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

Exit mobile version