Site icon NTV Telugu

Oval Test: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ తుది జట్టులో మూడు మార్పులు! మళ్లీ వచ్చేశాడు బాబోయ్

India Playing Xi

India Playing Xi

India playing XI against England for 5th Test: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్‌ జట్ల మధ్య మరికాసేపట్లో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. భారత్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ తుది జట్టులో మూడు మార్పులు చేశాడు. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాల స్థానాల్లో ధృవ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. కరుణ్ మరలా తుది జట్టులోకి రావడంతో నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ‘మళ్లీ వచ్చేశాడు బాబోయ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐదో టెస్టు భారత్‌కు అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. సిరీస్‌ను సమం చేసేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఓడినా.. డ్రా అయినా సిరీస్‌ను కోల్పోవాల్సిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కారణంగా టాస్ కాస్త లేట్ అయింది. రెండో రోజు ఆటకు కూడా వరణుడు పొంచి ఉన్నాడు. ఇదే ఇప్పుడు భారత శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), కరుణ్‌ నాయర్‌, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురేల్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్, ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌.
ఇంగ్లండ్: జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌ (కెప్టెన్‌), జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, జాకబ్‌ బెథెల్‌, జెమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, గుస్ అట్కిన్సన్, జెమీ ఓవర్టన్‌, జోష్‌ టంగ్‌.

 

Exit mobile version