ఒడిశా రైలు ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేస్తూ కన్నడిగుల భద్రతకు భరోసా ఇచ్చారు. బాలాసోర్ రైలు ఘటనలో కర్ణాటక వాసుల భద్రతకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. రైలు ప్రమాదంలో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. నిన్న ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం విషయంలో అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టాలి.. మరో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. ఆ కుటుంబాలకి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని కర్ణాటక సీఎం అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తాను ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నాను అని సిద్ధరామయ్య తెలిపారు.
Also Read : Adipurush: ‘ఆదిపురుష్’ కోసం మీ సాహసం.. గుర్తుండిపోతారయ్యా
నిన్న ( శుక్రవారం ) రైలు ఢీకొనడానికి గల కారణాన్ని కనుక్కోవాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. మృతుల సంఖ్య 290కి పెరిగింది.. 1000 మందికి పైగా గాయపడ్డారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రాథమిక నివేదిక ప్రకారం, 900 మందికి పైగా గాయపడ్డారు. నివేదిక ప్రకారం టోల్ 238 నుండి 261కి పెరిగిన్నట్లు వెల్లడించింది.
Also Read : Gold Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..!
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, ఐదు ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) యూనిట్లు మరియు 24 ఫైర్ సర్వీసెస్ మరియు ఎమర్జెన్సీ యూనిట్లు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి. భారత వైమానిక దళం (IAF) మరణించిన మరియు గాయపడిన వారి తరలింపు కోసం Mi-17 హెలికాప్టర్లను మోహరించింది. తూర్పు కమాండ్ ప్రకారం, IAF పౌర పరిపాలన మరియు భారతీయ రైల్వేలతో సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది.