Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Our People Will Do A Lot Minister Kollu Ravindra Warns To Ycp In Fake Liquor Case

Fake Liquor Case: కంట్రోల్ చేస్తున్నా, వదిలితే మా వాళ్లు చాలా చేస్తారు.. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్!

Published Date :October 11, 2025 , 6:05 pm
By Sampath Kumar
  • లిక్కర్ స్కామ్‌లో ఎంతటి వారైనా వదిలేది లేదు
  • పోలీసు స్టేషన్‌లో అంత రాద్ధాంతం చేయాల్సిన పనేముంది?
  • నేను కంట్రోల్ చేస్తున్నా, వదిలితే తమ వాళ్లు చాలా చేస్తారు
Fake Liquor Case: కంట్రోల్ చేస్తున్నా, వదిలితే మా వాళ్లు చాలా చేస్తారు.. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కల్తీ మద్యం కేసులో ఎంతటి వారైనా వదిలేది లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. మచిలీపట్నంలో గతంలో ప్రజాప్రతినిధులా, ఇప్పుడు వారే రౌడీలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. పోలీసు స్టేషన్‌లో అంత రాద్ధాంతం చేయాల్సిన పనేముంది?.. ప్రతీదీ కౌంట్ అవుతుంది, చట్టాలున్నాయి అని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి అన్నారు. కొందరు ఇష్టం వచ్చినట్టు తన మీద మాట్లాడుతున్నారని.. తన వాళ్లని నేను కంట్రోల్ చేస్తున్నా అని, వదిలితే తమ వాళ్లు చాలా చేస్తారు అని పేర్కొన్నారు. డిఫమేషన్‌కు వెళుతున్నాం అని, ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పేర్ని నాని లిక్కర్ కేసులోనే జైలుకు వెళ్లాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

‘మొలకల చెరువు కల్తీ మద్యంపై పూర్తి విచారణ జరుగుతోంది. 20 మందిలో 14 మందిని అరెస్టు చేశాం. జనార్ధన్ రావును కూడా కష్టడిలోకి తీసుకున్నాం. కల్తీ‌ మద్యంకు లింక్‌లో ఉన్న వైన్ షాపును సీజ్ చేశాం. ఐదుగురిని అరెస్టు చేసి, 4గురుకి పీటీ వారెంట్ ఇచ్చాం. హైదరాబాద్‌, బెంగళూరు, మన రాష్ట్రంలో నాలుగు టీంలు పెట్టాం. ప్రతీ షాపుకు క్లియర్ ఇనస్ట్రక్షన్లు ఇచ్చాం. సెబ్ (SEB)ను కూడా ఎక్సైజ్‌లో కలిపి బలమైన ఎన్ఫోర్స్మెంట్ తెచ్చాం. APTATS యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేశాం. ఒక మందు బాటిల్‌కు సంబంధించిన ప్రతీ అంశం ఈ యాప్‌లో దొరుకుతుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందరూ ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గతంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చినవి కూడా కంట్రోల్ చేశాం. ఈఎన్ఏ మన రాష్ట్రంలో దొరికేలా చేశాం. ఇల్లిసిట్ లిక్కర్ ఎక్కడా ఉండకూడదని నవోదయ ప్రోగ్రాం చేస్తున్నాం’ అని శనివారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో చెప్పారు.

Also Read: Indrakeeladri: మీరే ప్రెస్‌మీట్ నిర్వహించుకోండి.. తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం!

‘2019 వరకూ నడిచిన బ్రాండ్లు ఏమైపోయాయి వైఎస్ జగన్ చెప్పాలి. కొన్ని కంపెనీలు మీరు సృష్టించారు. షాపులలో ఉండే వారిని ఔట్ సోర్సింగ్ చేసి కమీషన్లు కొట్టారు. మీ నాయకులతోనే షాపులు ఇప్పించి అద్దెలు తీసుకున్నారు. సిట్ ఎంక్వైరీలో అన్ని వివరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాశనం చేసారు. మా పార్టీకి చెందిన జయచంద్రా రెడ్డి ఉంటే మేం వెంటనే సస్పెండ్ చేశాం. తెనాలిలో వైసీపి బూత్ కన్వీనర్ ఈ కేసులో ఉంటే సస్పెండ్ చేయలేదు. కాకాణి, రామిరెడ్డి ప్రతాప్ లాంటి‌ వారిపై చర్యలేవి?. నలుగురు చనిపోయారని అసత్య ప్రచారం చేశారు. ఎవరు చనిపోయినా కల్తీ మద్యంతో లింక్ చేస్తున్నారు. శవ రాజకీయాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం. ఒక SHO ని సస్పెండ్ చేసాం. కల్తీ లిక్కర్ లాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తాం. జనార్ధన్ రావుకి ఇబ్రహీంపట్నంలో రెండు షాపులున్నాయి. లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి మిథున్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ ఎలా అడుగుతారు. దొంగలే దొరల్లా మాట్లాడటం బాధాకరం. తంబళ్లపల్లెలో సెప్టెంబరు నెల నుంచే చిన్న బాటిళ్ళ ఇండెంట్ తగ్గింది. అన్ని షాపులూ మరోసారి ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడైనా కల్తీ మద్యం ఉందని తేలితే ఆ షాపులు రద్దు చేస్తాం. వైసీపీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP fake liquor case
  • ap liquor case
  • Kollu Ravindra Comments
  • Kollu Ravindra press meet
  • Minister Kollu Ravindra

తాజావార్తలు

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions