NTV Telugu Site icon

OTT Platforms : ఆ 18 ఓటీటీలు బ్యాన్.. కారణం ఇదే !

Ott

Ott

OTT Platforms : బడికి, కాలేజీలకు వెళ్లే టీనేజీ స్టూడెంట్స్, యూత్ ని టార్గెట్ చేస్తూ పక్కా బూతు కంటెంట్ తో కొన్ని ఓటీటీలు గ్యాంబ్లింగ్ చేస్తున్నాయ‌న్న విమర్శలు ఇటీవల కాలంలో వచ్చాయి. కనీస పరిమితులు లేకుండా ఇష్టం వచ్చినట్లు అడ‌ల్ట్ కంటెంట్ ని ఓటీటీల్లో య‌థేచ్ఛ‌గా ప్రసారం చేస్తూ టీనేజ‌ర్లను మ‌భ్య‌పెడుతున్నాయ‌ని ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ప్ర‌తిదీ స‌మాచార ప్ర‌సారాల శాఖ స్క్రుటినీలో ఉంది. డిజిట‌ల్ కంటెంట్ విష‌యంలో చ‌ట్టాలు క‌ఠిన‌త‌రంగా మారిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ – డిజిట‌ల్ కంటెంట్ పై ఇప్పుడు కంట్రోల్ స్పష్టంగా ఉంది. అందుకే ఇక బూతు ఓటీటీల‌కు కాలం చెల్లిన‌ట్లేనని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also:MP Chamala Kiran: రియల్ హీరో అనుకున్నాం కానీ.. రీల్ హీరో లాగానే వ్యవహరించారు..

అడల్ట్ కంటెంట్ తో డ‌బ్బు సంపాదించాల‌ని ఆశ‌ప‌డిన కొన్ని ఓటీటీల‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. అలాంటి వాటిని ప‌రిశీలిస్తే.. హంటర్స్, రాబిట్, హాట్ షాట్స్ VIP, చికూఫ్లిక్స్ , ప్రైమ్ ప్లే, డ్రీమ్ ఫైల్స్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్‌ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, వూవి, యెస్మా, అన్‌కట్ అడ్డా, ట్రిక్ ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియాన్ ఎక్స్ వీఐపీ, ఫుగీ, బేషరమ్స్ వంటి 18 బి గ్రేడ్ ఓటీటీలను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. కంటెంట్ విష‌యంలో స‌మాచార ప్రసారాల శాఖ‌ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డం కారణంగా వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం నుంచి అందాయి.

Read Also:U19 Asia Cup 2024: మెరిసిన తెలంగాణ అమ్మాయి.. ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్‌!

ప్రస్తుత కాలంలో పోటీలో ఉన్న పాపుల‌ర్ ఓటీటీల‌కు డూప్లికేట్ పేర్లను సృష్టించి కొన్ని డిగ్రేడ్ ఓటీటీలు చెలామణి అవుతున్నాయి. అడ‌ల్ట్ కంటెంట్ తో న‌డుస్తున్న ఇలాంటి వాటికి ఇక‌ చెక్ ప‌డిపోనుంది. ఇటీవ‌ల‌ డిజిట‌ల్ గా వినోదాన్ని ఆస్వాధించాల‌నుకునే ప్రేక్షకుల శాతం అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఓటీటీ కంటెంట్ పై ప‌రిశీల‌న, కంట్రోల్ చాలా అవ‌స‌రమ‌ని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా పిల్ల‌లు చెడిపోకుండా కాపాడేందుకు స్పెషల్ పాలసీని రూపొందించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

Show comments