NTV Telugu Site icon

Oscar Awards 2024: ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్‌ డౌనీ జూనియర్‌!

Robert Downey Jr

Robert Downey Jr

Robert Downey Jr Wins Best Supporting Actor for Oppenheimer: సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డ్‌ల వేడుక అట్టహాసంగా మొదలైంది. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డ్‌ల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం హోస్ట్‌గా జిమ్మీ కిమ్మెల్ ఉన్నాడు. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ ‘ఒపెన్‌ హైమర్’ అత్యధిక నామినేషన్‌లతో (13) ఆస్కార్‌ అవార్డ్ 2024కు వచ్చింది. పూర్ థింగ్స్ (11), కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

‘ఓపెన్‌ హైమర్’ ఈ సీజన్‌లో అత్యధిక అవార్డులను అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా ఉత్తమ నటుడి ట్రోఫీని ఆస్కార్‌ అవార్డ్‌ 2024లో సొంతం చేసుకుంటుందని అందరూ భావించారు. ఒపెన్‌ హైమర్‌లో తన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్ ఎంపికయ్యారు. ఇదే చిత్రంకు గాను ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో జెన్నిఫర్‌ లేమ్‌కు అవార్డు దక్కింది. పూర్ థింగ్స్‌ సినిమాకు గాను బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌ (నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌), ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌ (హోలి వెడ్డింగ్‌టన్‌), బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ (జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌) అవార్డులు వచ్చాయి. అవార్డుల కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన అవార్డుల జాబితా ఇదే.

ఆస్కార్‌ అవార్డ్స్ 2024 లిస్ట్:
# ఉత్తమ సహాయ నటుడు – రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)
# ఉత్తమ సహాయ నటి – డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
# బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌ – నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
# బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే – కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
# బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే – జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
# బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
# ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌ – హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
# బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
# ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ – ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
# ఉత్తమ ఎడిటింగ్‌ – జెన్నిఫర్‌ లేమ్‌ (ఓపెన్‌హైమర్‌)
# ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – గాడ్జిల్లా మైనస్‌ వన్‌
# ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌) – ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌