Site icon NTV Telugu

Orthopedic Walkathon: నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో ఆర్థోపెడిక్ వాక్‌థాన్‌

Orthopedic Walkathon

Orthopedic Walkathon

Orthopedic Walkathon: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద మూనట్ (Moonot) వారి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వాక్‌థాన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ వాక్‌థాన్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల్లో ఎముకలు, కీళ్ల సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశ్యంగా ప్రకటించారు. 3 కి.మీ, 5 కి.మీ, 7 కి.మీ వాక్‌థాన్ నెక్లెస్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకూ కొనసాగింది. ఇందులో వివిధ వయసుల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్థోపెడిక్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఎముకలు మన శరీరానికి చాలా ముఖ్యమైనవి. అవి బలంగా ఉండేందుకు రోజూ వాకింగ్, రన్నింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు.

Also Read: India vs England: కటక్ వేదికగా దుల్ల కొట్టేయడానికి సిద్దమైన టీమిండియా.. కోహ్లీ తిరిగి రానున్నాడా?

ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్‌లో కూడా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తాయిని చెప్పారు. వైద్య రంగంలో వస్తున్న నూతన మార్పుల నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆర్థోపెడిక్ సమస్యలపై అవగాహన పెంచుకోవడం అత్యంత అవసరమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలంతా తమ జీవితాల్లో శారీరక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రేరణ పొందారని అభిప్రాయపడ్డారు.

Exit mobile version