NTV Telugu Site icon

ROBO Lawyer: తొలిసారి కోర్టులో వాదించనున్న రోబో లాయర్

Robot Lawyer

Robot Lawyer

ROBO Lawyer : తమ కేసులను కోర్టులో వాదించాలంటే న్యాయవాదులకు ఫీజులు చెల్లించలేని స్థితిలో చాలామంది ఉంటారు. అటువంటి వారి ఇబ్బందులు ఇకమీదట తొలగిపోనున్నాయి. ఒక రోబో లాయర్లు కోర్టులో వాదించనున్నాయి. నమ్మశక్యం కాని నిజమైనా ఇది త్వరలోనే సాధ్యం కానుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతో రూపొందించిన రోబో న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించనున్నది. దీని ద్వారా కోర్టు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని దానిని తయారు చేసిన అమెరికాకు చెందిన ‘డునాట్‌పే’ సంస్థ వెల్లడించింది.

Read Also:KA Paul : రెచ్చగొడితే రెచ్చిపోవద్దు.. నేనున్నాను

కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన ఈ రోబో లాయర్‌ ఫిబ్రవరిలో కోర్టులో తొలిసారి వాదించనున్నట్లు తెలిపింది. అయితే ఏ కోర్టులో ఎవరిపై వాదిస్తుంది అన్న వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు. ఈ రోబో లాయర్ స్మార్ట్‌ఫోన్‌ సహకారంతో పని చేస్తుందని న్యూ సైంటిస్ట్ పేర్కొంది. కోర్టులో వాదనలు విన్న తర్వాత ఏం వాదించాలో అన్నది ఇయర్‌ ఫోన్‌ ద్వారా ప్రతివాదికి సూచిస్తుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జాషువా బ్రౌడర్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ 2015లో కాలిఫోర్నియాలో ‘డునాట్‌పే’ సంస్థను స్థాపించారు. తాము రూపొందించిన ‘డునాట్‌పే’ యాప్‌ ప్రపంచంలోనే మొదటి రోబో లాయర్‌ అని ఆయన తెలిపారు. ఈ రోబో న్యాయవాది పని తీరుకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.