NTV Telugu Site icon

Oppo Reno 12: మొబైల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్న ఒప్పో

Oppo (1)

Oppo (1)

Oppo Reno 12 Huge Discount In Amazon: ఒప్పో గత సంవత్సరం విడుదల చేసిన Oppo Reno 12 ఇప్పుడు భారతదేశంలో OIS కెమెరా కలిగిన అత్యంత ప్రత్యేకమైన ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్‌లో అనేక AI ఫీచర్లు ఉన్నాయి. వీటితో ఫోటో లుక్, ఫీల్‌ను మార్చుకోవచ్చు. ఇకపోతే, ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో దాని లాంచ్ ధర కంటే రూ. 5000 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఇది కూడా అతి తక్కువ కాలపరిమితికే అందిస్తున్నారు. ఇక మొబైల్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Merugu Nagarjuna: సీఎం చంద్రబాబు నిజస్వరూపం బయపడింది!

ఈ మొబైల్ లో కెమెరా ఫీచర్లు గమనించినట్లైతే.. – OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్, 32MP సెల్ఫీ కెమెరా, 4K 30fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, మాలి-G615 GPUతో కలిపి ఉంది. Android 14 ఆధారిత ColorOS 14తో వస్తుంది. ఇక మొబైల్ డిస్‌ప్లే చూస్తే.. 6.7 అంగుళాల OLED స్క్రీన్, ఫుల్ HD+ రిజల్యూషన్ 2412×1080 పిక్సెల్స్ గా ఉంది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది.

Also Read: Naveen Polishetty : ‘అనగనగా ఒకరాజు’ ప్రీ వెడ్డింగ్ ప్రోమో.. కెవ్వు కేక

ఇక మొబైల్ లో 5,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ అందుబాటులో ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక మొబైల్ ఇతర ముఖ్య ఫీచర్లు చూస్తే.. IP65 రేటింగ్ (ధూళి, నీటి నిరోధకత).. ఇంకా స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంటుంది. ఇక ధర, ఆఫర్ల విషయానికి వస్తే బేస్ వేరియంట్ (8GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ప్రారంభ ధర రూ. 32,999గా ఉండగా.. అమెజాన్ డిస్కౌంట్ తర్వాత రూ. 27,980కు అందుబాటులో ఉంది. అంతేకాదు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా రూ. 1000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేకమైన డీల్స్‌తో అందుబాటులో ఉంది. అత్యుత్తమ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్ అవసరం ఉన్నవారికి Oppo Reno 12 మంచి ఎంపిక.

Show comments