Site icon NTV Telugu

Oppo Reno 11: ఒప్పో రెనో 11 మార్కెట్ లోకి వచ్చేసిందోచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

Oppo Reno11

Oppo Reno11

ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇటీవల కాలంలో కెమెరా కోసం కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తమ జ్ఞాపకాలను ఫోన్‌లో పదిలం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కెమెరా పరంగా అప్పో ఫోన్లు ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే తాజాగా ఒప్పో రెనో 11 మొబైల్ గురించి అప్డేట్ ను అందించింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ ఫోన్‌ను భారతదేశంలో జనవరి 12, 2024న ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. భారతదేశంలో రెనో 11 సిరీస్‌ను ఫస్ట్ లుక్‌తో పాటు లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత లాంచ్ డేట్ కన్ఫర్మేషన్ వచ్చింది.. ఈ ఫోన్ 32 ఎంపీ టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. అలాగే బ్రాండ్ న్యూ కలర్‌ ఓఎస్‌ 14తో పని చేస్తుంది. ప్రామాణిక మోడల్ 67 వాట్స్‌ సూపర్‌ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే ప్రో మోడల్ 80 వాట్స్‌ సూపర్‌ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో వస్తుంది..

ఈ ఫోన్ ను చైనాలో నవంబర్ లో విడుదల చేసింది.. ఈ వేరియంట్ 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్‌ 10+ మద్దతుతో ఓఎల్‌ఈడీ స్క్రీన్‌లను కలిగి ఉంది. రెనో 11 4 ఎన్‌ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌తో వస్తుంది. అయితే ప్రో మోడల్‌లో 4 ఎన్‌ఎం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్‌ 1 ప్రాసెసర్ ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎక్స్‌ ఆప్టికల్ జూమ్‌తో 32 ఎంపీ టెలిఫోటో సెన్సార్, 112 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.. ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి ఉంటుంది.. 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది.. ఈ ఫోన్ లాంచ్ గురించి డేట్ వచ్చినా కూడా ధర గురించి ఎక్కడ ప్రకటించలేదు..

Exit mobile version