NTV Telugu Site icon

Oppo Reno 10 5G Price: లీకైన ఒప్పో రెనో 10 5జీ ధర.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు!

Oppo Reno 10 Pro Plus

Oppo Reno 10 Pro Plus

Oppo Reno 10 Series 5G Launch 2023 in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఒప్పో’.. రెనో 10 5జీ (Oppo Reno 10 5G) సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. గత మేలో చైనా మార్కెట్లో ఒప్పో రెనో 10 (Oppo Reno 10), ఒప్పో రెనో 10 ప్రో (Reno 10 Pro) మరియు ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ (Reno 10 Pro+) స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఆవిష్కరించింది. ఇప్పుడు ఇవే ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ ధరలు లీక్ అయ్యాయి.

Oppo Reno 10 5G Price:
ఒప్పో రెనో 10, ఒప్పో రెనో 10 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్‌ల ధరలను టిప్‌స్టర్ ముకుల్ శర్మ లీక్ చేశారు. ఒప్పో రెనో 10 ధర రూ. 38,999గా ఉంటుందని పేర్కొన్నాడు. రెనో 10 ప్రో ధర రూ. 44,999లుగా ఉంటుందని.. రెనో 10 ప్రో+ ధర రూ. 59,999గా ఉంటుందని ముకుల్ శర్మ తెలిపారు. రామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్ పరంగా వీటి ధరలు ఉంటాయి. ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రో ఇయర్‌ఫోన్‌ల ధర రూ. 7,999గా ఉంది.

Oppo Reno 10 5G Camera:
భారత మార్కెట్లో ఒప్పో రెనో 10, ఒప్పో రెనో 10 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్స్ అన్ని లేటెస్ట్ టెక్నలజీతో వస్తాయి. ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తుందని తెలుస్తోంది. ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 64-మెగా పిక్సెల్ టెలిఫోటో పోర్ట్రైట్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సర్ విత్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్ వైడ్ యాంగిల్ కెమెరాతో ఉంటాయి. ఇక సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.

Also Read: Karumuri Nageshwara Rao: రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Oppo Reno 10 5G Battery:
ఒప్పో 10 సిరీస్ ఫోన్‌లు 5,000mAh బ్యాటరీతో వస్తాయని తెలుస్తోంది. ఇది 47 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగల 67W ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి.

Oppo Reno 10 5G Features:
ఒప్పో 10 సిరీస్ పంచ్-హోల్ కటౌట్‌తో కూడిన 3D కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. పిల్ ఆకారపు కెమెరా మాడ్యూల్ ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. రెనో 10 సిరీస్ ప్రామాణిక మరియు ప్రో వేరియంట్‌లలో పెరిస్కోప్ కెమెరాకు బదులుగా 32 మెగా పిక్సెల్స్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 10 ప్రోడుయో మోడల్ 12GB + 256GB RAM కాన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉంటుంది. అయితే ప్రామాణిక మోడల్ 8GB + 256GB ఎంపికతో వస్తుంది.

Also Read: Salaar Teaser: సలార్‌ పార్ట్‌-1.. ‘సీజ్‌ఫైర్‌’ అంటే ఏంటో తెలుసా?