Oppo K13 Turbo Pro: భారతదేశంలో Oppo K13 Turbo Pro ఆగస్టు 15 నుండి కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం Oppo K13 Turbo తో కలిసి లాంచ్ చేశారు. రెండు ఫోన్లలోనూ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌లో భాగంగా పనిచేసే సెంట్రిఫ్యూగల్ కూలింగ్ ఫ్యాన్స్ అమర్చబడ్డాయి. ఇవి ఫోన్ వేడి తక్కువయ్యేలా సహాయపడతాయి. Oppo K13 Turbo Pro లో 1.5K AMOLED డిస్‌ప్లే, Snapdragon 8s Gen 4 చిప్‌సెట్, AI ఆధారిత ఫీచర్లు, అలాగే 7,000mAh బ్యాటరీ ఉన్నాయి.
Mahindra new SUVs 2025: ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. మహీంద్రా నుంచి 4 కొత్త SUV లు రిలీజ్
ఇక Oppo K13 Turbo Pro ధర విషయానికి వస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.37,999 కాగా, 12GB RAM వేరియంట్ ధర రూ.39,999గా నిర్ణయించారు. అయితే కంపెనీ ప్రకారం Oppo K13 Turbo Pro కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందుతుంది. ఈ ఆఫర్ Axis బ్యాంకు, బ్యాంక్ అఫ్ బరోడా, DBS బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, HDFC బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, SBI వంటి ప్రముఖ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల EMI లావాదేవీలపై వర్తిస్తుంది. అంతేకాక, పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.3,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే, తుది డిస్కౌంట్ ధర పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితి, అలాగే ఆఫర్ అందుబాటుపై ఆధారపడి ఉంటుంది.
Massive Cloudburst: స్వాతంత్ర్య దినోత్సవం వేళ మృత్యుఘోష.. 65కు చేరిన మృతుల సంఖ్య..
ఈ ఆఫర్లతో 8GB వేరియంట్ ధర రూ.34,999కి, 12GB వేరియంట్ ధర రూ.36,999కి తగ్గుతుంది. అలాగే, పూర్తి ధరను ఒకేసారి చెల్లించకూడదనుకునే వారు, ప్రముఖ భారతీయ బ్యాంకులతో భాగస్వామ్యంగా అందించే నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు కూడా. ఈ ఫోన్ మిడ్‌నైట్ మావెరిక్, పర్పుల్ ఫాంటమ్, సిల్వర్ నైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా e-స్టోర్, ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇక ఫ్లిప్ కార్ట్ మినిట్స్ సర్వీస్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
