Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..

Oppo

Oppo

ఒప్పో సంస్థ తన కొత్త ‘ఒప్పో F35 సిరీస్’ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో అక్టోబర్ 5న విడుదల చేయనుంది. ఇందులో ఒప్పో F35 5G, ఒప్పో F35 ప్రో 5G అనే రెండు మోడల్స్ రానున్నాయి. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాగే ఒప్పో అధికారిక వెబ్‌‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డిజైన్ పరంగా స్టాండర్డ్ మోడల్ పిల్-షేప్ కెమెరా మోడల్‌తో, ప్రో మోడల్ రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్‌తో రానున్నాయి. స్టాండర్డ్ మోడల్ పింక్, లైట్ బ్లూ రంగుల్లో, ప్రో మోడల్ ఆరెంజ్ రంగులో టీజ్ చేయబడ్డాయి.

కెమెరా విషయానికి వస్తే.. ఈ సిరీస్‌లోని రెండు ఫోన్‌లు సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. అలాగే ఒప్పో F35 ప్రో 5G వెనుకభాగంలో OIS సపోర్ట్ కలిగిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. స్టాండర్డ్ F35 5G మోడల్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. డ్యూయల్-వీడియో మోడ్, AI పోర్ట్రెయిట్ గ్లో వంటి ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

పనితీరు కోసం ఒప్పో F35 ప్రో 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మాక్స్ చిప్‌సెట్, స్టాండర్డ్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 చిప్‌సెట్ అమర్చారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత శక్తివంతమైన 8000mAh భారీ బ్యాటరీతో పాటు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండటం విశేషం. బడ్జెట్, ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.