NTV Telugu Site icon

Operation Valentine : ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ఫస్ట్ స్ట్రైక్ రిలీజ్ టైం ఫిక్స్..

Whatsapp Image 2023 12 17 At 2.30.14 Pm (1)

Whatsapp Image 2023 12 17 At 2.30.14 Pm (1)

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్ర లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్‌ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.శక్తిప్రతాప్‌ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లు గా ఎలాంటి అప్‌డేట్స్ మేకర్స్ ఇవ్వలేదు. ఈ మూవీకి సంబంధించిన కొత్త న్యూస్ ఎప్పుడొస్తుందా అని వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ నుంచి మేకర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్ ను ఇచ్చారు.

ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ రేపు ఉదయం 11.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ టీజర్ అయ్యిండొచ్చని మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ మరియు రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది.అయితే మొదట ఈ మూవీని డిసెంబర్ 08 న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమాని మేకర్స్ వాయిదా వేశారు.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ను 2024 ఫిబ్రవరి 16 న తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం లో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.