Site icon NTV Telugu

Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ శిథిలాలను కూల్చిన ఉగ్రవాదులు.. లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి!

Terror Camps

Terror Camps

Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్థాన్‌లోని మురిడ్కేలో ఉన్న లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మే 7 రాత్రి భారత వైమానిక దళం ఈ కాంప్లెక్స్‌ను లక్ష్యంగా చేసుకొని బాంబులు కురిపించింది. దాడిలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని ఇప్పుడు లష్కర్ స్వయంగా JCB యంత్రాలతో కూల్చివేసింది. ఎందుకు ఈ ఉగ్రవాదులు వారి భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తున్నారు. అసలు లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Sudershan Reddy : ఆత్మ ప్రబోధంతో ఓటేయండి

ఉగ్ర సంస్థ పునర్నిర్మాణంపై దృష్టి సారించిందా?
మే 7న పాకిస్థాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 12:35 గంటలకు భారత వైమానిక దళం మురిడ్కేలోని మర్కజ్ తైబాపై వైమానిక దాడి నిర్వహించింది. గత 25 ఏళ్లుగా ఉగ్రవాదులకు శిక్షణ, వసతి, ఆయుధాలు అందిస్తున్న ప్రదేశం ఇదే. రెండు అంతస్తుల ఈ భవనం ‘ఉమ్-ఉల్-ఖురా’ ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనాల్లో లష్కరే అగ్ర కమాండర్ల కార్యాలయాలు, ఉగ్రవాదుల నివాస గదులు ఉన్నాయి. తాజా ఉగ్ర సంస్థ ఈ శిథిలాలను పూర్తి కూల్చివేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నాటికి ఈ ప్రదేశంలో కొత్త భవనాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

భారత దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం దెబ్బతిన్న భవనాలను తన ఖర్చుతో పునర్నిర్మించుకుంటామని ప్రకటించినట్లు పలు నివేదికలు తెలిపాయి. ఆగస్టు 18 నుంచి లష్కరే స్వయంగా JCB యంత్రాలతో శిథిలాలను కూల్చివేస్తుంది. సెప్టెంబర్ 4 నాటికి, ‘ఉమ్-ఉల్-ఖురా’ కూల్చివేశారు. తాజా ఈరోజు ఉదయం ఎర్ర భవనాన్ని కూడా కూల్చివేశారు.

కొత్త నిర్మాణానికి సన్నాహాలు..
లష్కరే తోయిబా 2026లో జరిగే వార్షిక కార్యక్రమానికి ముందు కనీసం ఒక భాగాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తోందని పలు నివేదికలు తెలిపాయి. ఈ పని మౌలానా అబూ జార్, యూనస్ షా బుఖారీ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు సమాచారం. కసూర్ జిల్లాలోని పటోకిలో ఉన్న ‘మర్కజ్ యార్మౌక్’ వద్ద ఉగ్రవాదులకు తాత్కాలిక శిక్షణ, వసతి ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు.

READ ALSO: Chandra Grahanam: కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. చూడాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం

Exit mobile version