Operation Sindhoor: ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి భారత్ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ మే 7 ఉదయం, పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభంతో ఇరుదేశాల మధ్య ప్రారంభమైన వివాదం దాదాపు 4 రోజుల పాటు కొనసాగి మే 10 సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ ప్రకటించడంతో ఆగింది. తాగా ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్‌ను భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు.
READ MORE: ’పెద్ది’ కోసం కీలక వ్యక్తిని తీసుకొచ్చిన రామ్ చరణ్
5 యుద్ధ విమానాలు ధ్వంసం..
బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎ.పి. సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన 5 ఫైటర్ జెట్లను, 1 AEW&CS విమానాన్ని భారత్ కూల్చివేసిందని ధ్రువీకరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ పాకిస్థాన్‌కు స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. కూల్చివేసిన విమానాలలో ఐదు పాకిస్థానీ యుద్ధ విమానాలు, ఒక గూఢచారి (నిఘా) విమానం AWACS ఉన్నాయని తెలిపారు. ‘విజయానికి ప్రధాన కారణం రాజకీయ సంకల్పం. మాకు చాలా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మాపై ఎటువంటి ఆంక్షలు విధించబడలేదు. ఏవైనా అడ్డంకులు ఉంటే, అవి స్వయంగా సృష్టించబడినవి. ఎంత దూరం ముందుకు సాగాలో మేము నిర్ణయించుకున్నాము. దానిని ప్లాన్ చేసి అమలు చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. మేము దాని గురించి పరిణతి చెందాలని కోరుకున్నాము కాబట్టి మా దాడులు బాగా ఆలోచించబడ్డాయి.’ అని పేర్కొన్నారు. తమ దాడిలో బహవల్పూర్ – జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయంలో పూర్తిగా ధ్వంసం అయ్యిందని అన్నారు. దాదాపుగా భవనంలో ఎటువంటి సామగ్రి మిగిలి లేదని అన్నారు. చుట్టుపక్కల భవనాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు తమ దగ్గర మాత్రమే కాకుండా, స్థానిక మీడియాలో కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. పాకిస్థాన్ ఎదుర్కొన్న నష్టాల సంఖ్య గురించి వైమానిక దళంలోని అత్యున్నత స్థాయి అధికారి నుంచి వెలువడిన మొదటి నిర్ధారణ ఇది. అయితే ఈ విషయంలో పాకిస్థాన్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు.
READ MORE: Hyd Traffic : రాఖీ పండుగ ఎఫెక్ట్.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్
