Site icon NTV Telugu

Operation Kagar: కర్రెగుట్టలో ఆపరేషన్‌ కగార్‌కు బ్రేక్‌..

15maoistskilled

15maoistskilled

మావోయిస్టుల ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను తీసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు మావోల ఏరివేతకు శ్రీకారం చుట్టాయి. ఈ ఆపరేషన్ లో పదుల సంఖ్యలో మావోలను మట్టుబెట్టారు. ఇదే సమయంలో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై ప్రతీకార దాడులకు తెరలేపింది. అయితే ఇప్పుడు దీని ప్రభావం ఆపరేషన్ కగార్ పై పడింది.

Also Read:Sofia Qureshi : పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇస్తున్నాం.. పాక్‌ ఎయిర్‌ బేస్‌లను లేపేసాం

ఈ నేపథ్యంలో కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్‌ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నారు. సీఆర్పీఎఫ్‌ బలగాలు వెంటనే హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. రేపు సాయంత్రంలోగా రిపోర్ట్‌ చేయాలని బలగాలను ఆదేశించారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆపరేషన్‌ కగార్‌కు బ్రేక్‌ పడింది.

Exit mobile version